Pawan Kalyan strategy: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లడ్డూ తయారీకి వాడిన నెయ్యి అంశం సంచలనంగా మారింది. సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటయింది. గత కొద్ది నెలలుగా విచారణ జరిగింది. అయితే ఈ లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ తాజాగా చార్జీ షీట్ దాఖలు చేసింది. అయితే అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాకుండా కెమికల్స్ తో తయారైన నెయ్యి వాడారని అదే రిపోర్టులో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించారు. దీనిపై అసెంబ్లీలోనే చర్చిద్దాం అంటూ వ్యాఖ్యానించారు. జనసేన ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అసెంబ్లీలో చర్చిద్దాం అని చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పడేశారు.
వాదనలు వినిపించాలని..
ప్రస్తుతం శాసనసభకు( assembly) హాజరుకావడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభలో మాట్లాడేందుకు సమయం ఇవ్వరని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే తాము సభకు హాజరు కావడం లేదని చెప్పుకొస్తున్నారు. సభకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న డిమాండ్ జగన్ పై ఉంది. అయితే ఇప్పుడు టీటీడీ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిలో జంతువు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అప్పట్లో టిటిడి మెట్లను కడిగారు. అయితే ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో జంతువు కొవ్వు లేదన్నది రిపోర్ట్ గా వచ్చింది. అదే సమయంలో అది పాలతో తయారుచేసిన నెయ్యి కాదని కూడా తేల్చేసింది. అయితే కల్తీ జరిగింది కానీ జంతువు కొవ్వు కలవలేదు అన్నది ఈ రిపోర్టు తేల్చింది. దానిని ఒక విజయం గా చెబుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు శాసనసభలో చర్చిద్దామని పవన్ కళ్యాణ్ ప్రకటనతోనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభకు హాజరవుతుందని ఒక వ్యూహంగా తెలుస్తోంది.
వైసీపీ ప్రచారానికి విరుగుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు జంతువు కొవ్వు కలవలేదని చెబుతోంది కానీ.. అదే సిబిఐ అసలు పాలతో తయారు చేయని నెయ్యి అది అని తేల్చేసింది. తద్వారా భారీ అవినీతి జరిగిందని తేల్చింది. కానీ ఎంతవరకు ఆ పార్టీ చంద్రబాబు జంతువు కొవ్వు కలిపారని ఆరోపించారు కదా? ఆ ఆరోపణ నిజం కాలేదు కదా? అని ఎదురు దాడి చేస్తోంది. కెమికల్స్ తో కూడిన నెయ్యి అని చెబుతోంది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషప్రచారంపై పవన్ తనదైన వ్యూహాత్మక ప్రకటన చేశారు. శాసనసభలో చర్చిస్తామని చెప్పడం ద్వారా.. వైసీపీకి గట్టి సంకేతాలే పంపారు. తప్పకుండా సభలో పూర్తిస్థాయిలో వైసిపి హయాంలో జరిగిన తప్పిదాలపై విరుచుకుపడే అవకాశం ఉంది. అయితే నెయ్యిలో కల్తీ జరగకుంటే శాసనసభకు వెళ్లి వాదనలు వినిపించవచ్చు కదా అని ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తేలా పవన్ ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.