Eshwar: ప్రభాస్ మొదటి సినిమా ‘ఈశ్వర్’ ఆరోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

మన తెలుగు సినిమా ఖ్యాతి ని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసిన హీరోగా ప్రభాస్ నిలిచిపోయాడు. అయితే ఈశ్వర్ సినిమాకి అప్పట్లో ఎంత వసూళ్లు వచ్చాయి, ఎన్ని కేంద్రాలలో 50 రోజులు, వంద రోజులు పూర్తి చేసుకుంది?, అసలు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Written By: Vicky, Updated On : October 23, 2024 4:51 pm

Eshwar

Follow us on

Eshwar: కృష్ణం రాజు నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రభాస్, మొదటి సినిమా ‘ఈశ్వర్’ తోనే మంచి గుర్తింపు ని తెచ్చుకున్నాడు. ఎవరీ కుర్రాడు, చూసేందుకు చాలా బాగున్నాడే, యాక్టింగ్ కూడా అదిరిపోయింది అని అప్పట్లో అందరూ అనుకునేవారు. కృష్ణం రాజు నట వారసుడిగా వచ్చినప్పటికీ, ప్రభాస్ కి రామ్ చరణ్, మహేష్ బాబు మొదటి సినిమాలకు జరిగినంత హుంగామ జరగలేదు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా అని మొదటి సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు కూడా రాలేదు. కేవలం తన నటనతోనే అభిమానులను మొదటి సినిమాతోనే సంపాదించుకున్నాడు. ‘ఈశ్వర్’ చిత్రాన్ని చూసిన తర్వాత కచ్చితంగా ఈ కుర్రాడు భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు కానీ, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించే స్థాయికి ఎదుగుతాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు.

మన తెలుగు సినిమా ఖ్యాతి ని ప్రపంచం నలుమూలల విస్తరింప చేసిన హీరోగా ప్రభాస్ నిలిచిపోయాడు. అయితే ఈశ్వర్ సినిమాకి అప్పట్లో ఎంత వసూళ్లు వచ్చాయి, ఎన్ని కేంద్రాలలో 50 రోజులు, వంద రోజులు పూర్తి చేసుకుంది?, అసలు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈశ్వర్ చిత్రం 2002, నవంబర్ 11 వ తారీఖున గ్రాండ్ గా విడుదలైంది. మొదటి ఆట నుండే ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అప్పట్లో డీసెంట్ గానే వచ్చాయి. అప్పటి ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా కి మొదటి రోజు కోటి రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. అలా బాక్స్ ఆఫీస్ రన్ ని మొదలుపెట్టిన ఈశ్వర్ చిత్రం ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి, కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. అలాగే 47 కేంద్రాలలో 50 రోజులు, 12 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

మొదటి సినిమా తో రీ సౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టకపోయిన కూడా పర్వాలేదు ఈ మాత్రం చాలు అనే రేంజ్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఇందులో ప్రభాస్ ఊర మాస్ క్యారెక్టరైజేషన్ ని చూస్తే, మళ్ళీ ఇలాంటి లోకల్ మాస్ రోల్ లో ప్రభాస్ ని చూస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అభిమానులకు వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రీసెంట్ గానే ఈ సినిమాని 4K కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా రీ రిలీజ్ లో 42 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిందట. ఇదే రోజున మిస్టర్ పర్ఫెక్ట్, సలార్, రెబల్ వంటి సినిమాలను కూడా రీ రిలీజ్ చేయడం వల్లనే ఈశ్వర్ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం పడిందని అంటున్నారు ప్రభాస్ అభిమానులు.