Prabhas wig : బాహుబలి 2 తర్వాత ప్రభాస్ లుక్ లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పటి హ్యాండ్సమ్ నెస్ ఆయన కోల్పోయారు. కళ్ళ క్రింద వలయాలు, అస్పష్టమైన వాయిస్ ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత ట్రై చేసినా ప్రభాస్ ని అందంగా చూపించలేకపోతున్నారు. మంచి కంటెంట్ తో తెరకెక్కిన సాహో విఫలం చెందడానికి ప్రభాస్ కూడా ఒక కారణం. ఆయన లుక్, వాయిస్ అసహజంగా అనిపించాయి. డైలాగ్స్ అర్థం కాని పరిస్థితి. అన్నింటికీ మించి ఆయన జట్టుపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రభాస్ పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు తలను కవర్ చేసుకుంటున్నాడు. క్యాప్ ధరిస్తున్నారు.

ప్రభాస్ జుట్టు సహజమా లేక విగ్గు వాడుతున్నారా ? అనే సందేహాలు ఎప్పటి నుండో ఉన్నాయి. తాజాగా బయటికొచ్చిన వీడియో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఆయన విగ్గు వాడుతున్నారని నిర్ధారించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న ప్రభాస్ జుట్టు మేకప్ అసిస్టెంట్ సెట్ చేస్తున్నాడు. ‘ఇవన్నీ నువ్వు అక్కడే చేయాలి. ఇలా బయట చేయవద్దని’ ప్రభాస్ ఆ కుర్రాడికి చెబుతున్నాడు. ఇక మేకప్ అసిస్టెంట్ జుట్టు సరి చేస్తున్న విధానం చూస్తే… కచ్చితంగా అది విగ్ అనిపిస్తుంది.
మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాల నాటికే ప్రభాస్ జుట్టు పల్చబడుతుంది. బాహుబలి చిత్రాల కోసం ఆయన బాగా జుట్టు పెంచారు. జుట్టు పొడవుగా పెంచితే ఎక్కువ మొత్తంలో ఊడిపోతుంది. అలా బాహుబలి సిరీస్ చేసిన ఐదేళ్లలో ఆయన జుట్టు పెద్ద మొత్తంలో లాస్ అయ్యారని సమాచారం. సాహో మూవీ నుండే ప్రభాస్ విగ్గు వాడుతున్నారు. పూర్తి స్థాయి విగ్గు కాకుండా ప్యాచ్ అప్ టెక్నిక్ తో కవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విగ్గు కూడా ప్రభాస్ కి సెట్ కావడం లేదు. నేచురల్ లుక్ ఇవ్వడం లేదు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు అత్యంత సహజంగా ఉండే విగ్గులు వాడుతున్నారు.
ఒకప్పటి హీరోలు జుట్టు పోవడాన్ని పెద్ద సమస్యగా భావించారు కాదు. సినిమాల్లో విగ్గు వాడినా పబ్లిక్ లో సహజ జుట్టుతో తిరిగేవారు. వేడుకల్లో పాల్గొనేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ అందరికీ నలబై ఏళ్ళు వచ్చే నాటికే జుట్టు ఊడిపోయింది. ఇక రజినీకాంత్ సహజంగా ఉండేదుకు ఇష్టపడతారు. ఆయన విగ్గువాడరు. నందమూరి హీరో బాలకృష్ణ సౌందర్య ప్రియుడు. యవ్వనంగా కనిపించాలని కోరుకుంటారు. జుట్టు పోయినప్పటి నుండి ఆయన విగ్గు వాడుతున్నారు. చాలా అరుదుగా విగ్గు లేకుండా కనిపిస్తారు. మహేష్ కూడా విగ్గే వాడుతున్నట్లు సమాచారం.
Odiyamma inni RojuLu hair Original Anukunna Kadara Barre @PrabhasRaju pic.twitter.com/jCUXimSlbn
— poorna ˢᵗʸˡᶦˢʰ 🔨 (@poorna041) December 21, 2022