https://oktelugu.com/

Prabhas : ఐదుగురు స్టార్ హీరోయిన్స్ తో డ్యాన్స్ ఇరగదీయనున్న ప్రభాస్…

గత సంవత్సరం సలార్ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడమే కాకుండా దాదాపు తొమ్మిది వందల కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది...

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2024 / 09:58 PM IST

    Prabhas will dance with five star heroines in the film Raja Saab

    Follow us on

    Prabhas : ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు ప్రభాస్.. ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజసాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో ఒక సాంగ్ ని కొరిగ్రాఫ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

    ఇక ఈ సాంగ్ లో ప్రభాస్ మాస్ స్టెప్పులు వేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా ఉన్న మాళవిక, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ లతో పాటుగా పూజ హెగ్డే, శ్రీలీలా లాంటి స్టార్ హీరోలు కూడా ఈ పాటలో ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా గుంటూరు కారం సినిమాలో కుర్చి మడత పెట్టి సాంగ్ లో అద్భుతంగా డాన్స్ చేసి మెప్పించింది. కాబట్టి తన క్రేజీని కూడా వాడుకోవాలనే ఉద్దేశ్యం తో ఈ సినిమాలో కూడా తనని ఒక సాంగ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఐదుగురు హీరోయిన్స్ తో సాంగ్ అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాస్ స్టెప్పులు వేస్తాడు అంటూ ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

    ఇక స్క్రీన్ మీద మాస్ స్టెప్పులతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హీరోయిన్లు కూడా తమ అందచందాలతో రెచ్చిపోయి మరి డ్యాన్స్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ ని అందుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.

    చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది..గత సంవత్సరం సలార్ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టడమే కాకుండా దాదాపు తొమ్మిది వందల కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుంది…