Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రారంభ దశ నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం లో హీరోయిన్ గా ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయిని తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎంతో మంది క్రేజ్ స్టార్ హీరోయిన్స్ ఉండగా, ఈమెని తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకున్నారు. అయితే ఈ అమ్మాయి చూసేందుకు చాలా అందంగా ఉండడంతో, ఫౌజీ తర్వాత అవకాశాలు క్యూలు కట్టాయి. అయితే ఈ చిత్రం ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని, ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తాడని, ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి, ఒక పాకిస్థాన్ అమ్మాయికి రజాకార్ మూవ్మెంట్ జరుగుతున్న రోజుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాని సోషల్ మీడియా లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కానీ ఇప్పుడు ఈ చిత్రం గురించి లేటెస్ట్ గా సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాన్ని చూసి అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ ఇప్పటికే రెండు చిన్న షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే 20 రోజుల భారీ షెడ్యూల్ ని ప్రారంభించుకోబోతుందట. ప్రస్తుతం ప్రభాస్ కాలిగాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇవ్వడంతో, ప్రభాస్ విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆయన తిరిగి రాగానే ఈ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారట. తమిళనాడులోని మధురై ప్రాంతంలో ఈ షెడ్యూల్ జరగబోతుందని టాక్. దేవీపురం అనే అగ్రహారం సెటప్ ని కూడా సిద్ధం చేశారట. ఇప్పటి వరకు భీకరమైన యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీస్ లో ప్రభాస్ ని చూసిన జనాలు, ఈ బ్రాహ్మణుడి క్యారక్టర్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
స్టార్ హీరోలు బ్రాహ్మణుడి క్యారక్టర్ చేయడమంటే పెద్ద రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకంటే ఎన్టీఆర్ గతం లో ‘అదుర్స్’ అనే చిత్రంలో ‘చారీ’ అనే క్యారక్టర్ చేసాడు. ఈ పాత్ర అప్పట్లో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్రాహ్మణుడి హావభావాలతో ఎన్టీఆర్ అద్భుతంగా నటించి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కొన్నాళ్ళకు అల్లు అర్జున్ కూడా ‘దువ్వాడ జగ్గన్నాధం’ చిత్రంలో బ్రాహ్మణుడి పాత్ర పోషించాడు. ఆ సమయం లో అల్లు అర్జున్ నటనని అందరూ జూనియర్ ఎన్టీఆర్ పోషించిన చారీ క్యారక్టర్ తో పోల్చి చూసారు. దాని వల్ల సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ కి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నుండి ‘రాజా సాబ్’ చిత్రం తెరకెక్కుతుంది. ముందుగా ఈ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది