Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ఈయన రామ్ చరణ్ (Ram Charan) ఎన్టీయార్(NTR) లను హీరోలుగా పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది…ఇక ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి కి ఉన్న స్టార్ డమ్ ను విస్తరింపజేసిందనే చెప్పాలి.ఇక ఇది ఇలా ఉంటే ‘త్రిబుల్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసిన ప్రమోషన్స్ చాలా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇక వీళ్ళను కీరవాణి ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు. ఇక అందులో భాగంగానే తారక్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మా చరణ్ కి ఒక అలవాటు ఉంది అంటూ చరణ్ గురించి చెప్పసాగాడు… ఈ సినిమాలో అండర్ వాటర్ లో మేమిద్దరం కలుసుకునే ఎపిసోడ్ కు సంబంధించిన ఆ పర్టిక్యూలర్ సీన్ ను చిత్రీకరించడానికి సుమేర్ (Sumer) అనే ట్రైనర్ అయితే వచ్చారట…ఇక ఆ వ్యక్తిని మొదటి రోజు చరణ్ సమీర్ అని పిలిచాడట దాంతో సుమేర్ రెస్పాండ్ అయి చరణ్ దగ్గరికి వెళ్ళాడట…అప్పుడు ఎన్టీయార్ అయితే అతని పేరు సమీర్ ఏమో నేనే తప్పుగా అర్థం చేసుకున్న అన్నాడట.
ఇక ఆ నెక్స్ట్ డే చరణ్ అతన్ని సుమిత్ అని పిలిచారట. దానికి కూడా ఆ వ్యక్తి స్పందించి ఆ వస్తున్నాను సార్ అని చెప్పారట. అప్పుడు ఎన్టీఆర్ నీ పేరేంటి అని అతన్ని అదిగాడట దాంతో ఆయన సుమేర్ అని చెప్పాడట…మరి సమీర్, సుమిత్ అంటే రెస్పాండ్ అవుతున్నావ్ అని అడిగితే ఆ సుమేర్ అనే వ్యక్తి సార్ కి నాతో అవసరం ఉంది పిలుస్తున్నాడు. అందువల్ల రెస్పాండ్ అయ్యాను సార్ అని చెప్పాడట…
దాంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ కి ఎవరి పేరు చెప్పినా కూడా తను మొత్తానికైతే దాన్ని కిచిడి చేసేస్తాడు. ఏదో ఒక పేరుతో పిలుస్తూ ఉంటాడని చెప్పాడు. ఉదాహరణకి తారక్ అని నేను అతనికి పరిచయం అయితే చివరి లెటర్ అలాగే ఉంచి కారక్ అని ఇలా చేంజ్ చేసి పిలుస్తూ ఉంటాడని ఎన్టీయార్ కీరవాణి తో చెప్పాడు.
ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ లో ఉన్నప్పుడు యాంకర్ రామ్ చరణ్ ను ఉద్దేశించి మీలో మోస్ట్ యూస్ లెస్ టాలెంట్ ఏంటి అని అడిగితే దానికి రామ్ చరణ్ ‘ఫర్ గెటింగ్’ అని సమాధానం చెప్పాడు. మొత్తానికైతే అతనికి చిన్నగా మరిచిపోయే లక్షణం ఉందని చెప్పకనే చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా అప్పుడు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది…