Prabhas: ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలలో ప్రతి ఒకరికి హిట్లు ఉన్నాయి..డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి..ఒక హీరో చెయ్యాల్సిన సినిమా ఇంకో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం..లేదా డిజాస్టర్ ఫ్లాప్ కొట్టడం చాలానే మనం చూసాము..అయితే ఒక ఫ్లాప్ సినిమా స్టోరీ కోసం రెండు సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ స్టోరీస్ ని రిజెక్ట్ చేసాడు తాము అభిమానించే హీరో ఫాన్స్ కి తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే..ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ పరిస్థితి కూడా అదే.

అప్పట్లో ప్రభాస్ ఛత్రపతి వంటి భారీ హిట్ కొట్టి స్టార్ ఇమేజి సంపాదించిన తర్వాత చాలా మంది దర్శక నిర్మాతలు ‘అబ్బా..చేస్తే ఇలాంటి హీరో తోనే సినిమాలు చెయ్యాలి’ అనే రేంజ్ లో అనిపించేవాడు..పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో ఒక్క సినిమా చెయ్యడానికి క్యూలు కట్టేవారు..కానీ ప్రభాస్ స్టార్ ఇమేజి ఇంకా సాధించకముందే దిల్ రాజు అతని డేట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేసాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన ఆర్య సినిమా స్టోరీ ని తొలుత ప్రభాస్ కి సుకుమార్ గారితో వినిపించాడట దిల్ రాజు..కానీ ప్రస్తుతం నాకు మాస్ ఇమేజి బాగా వచ్చేసింది అని..ఇలాంటి సమయం లో ఇలాంటి లవ్ స్టోరీ చేస్తే జనాలు నన్ను చూడరని చెప్పి ఆ స్టోరీ ని రిజెక్ట్ చేసాడు..ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను మొదటి సినిమా..రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచినా సినిమా ‘భద్ర’ మూవీ స్టోరీ ని కూడా వినిపించాడట దిల్ రాజు..కానీ ఎందుకో ఆ కథని కూడా ఆయన రిజెక్ట్ చేసాడు.

ఇక చివరికి దిల్ రాజు వంశి పైడిపల్లి తో ఒక రోజు ప్రభాస్ ఇంటికి వెళ్లి,అతనిని కలిసి ‘మున్నా’ మూవీ కథని వినిపించాడు..ప్రభాస్ కి మున్నా మూవీ స్టోరీ చాలా కొత్తగా , కమర్షియల్ ఎలెమెంట్స్ పక్కాగా ఉంటూ ఫాన్స్ కి నచ్చే విధమైన స్టోరీ అనిపించడంతో వెంటనే ఓకే చెప్పి ఆ సినిమా చేసాడు..స్టార్ట్ అయితే అద్భుతంగా వచ్చింది కానీ..కమర్షియల్ గా మాత్రం ఆ సినిమా అప్పట్లో ఎందుకో సక్సెస్ కాలేదు..ఆ సినిమా టేకింగ్ పరంగా వంశి పైడిపల్లి బెస్ట్ అని చెప్పొచ్చు..కానీ ఎందుకో బాక్స్ ఆఫీస్ వద్ద గురి తప్పింది..ఇది నిజంగా ప్రభాస్ బ్యాడ్ లక్ అనుకోవాలి.