https://oktelugu.com/

Prabhas: సినిమాలే ఇంట్రెస్ట్ లేని ప్రభాస్ ను హీరో గా మార్చింది ఎవరో తెలుసా..?

ఇక బాహుబలి 2 సినిమా 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు భారీ డిజాస్టర్లను అందుకున్నాయి. దాంతో ప్రభాస్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 13, 2024 / 11:02 AM IST
    Follow us on

    Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న ప్రభాస్. ఇప్పుడు పాన్ ఇండియాలో తిరుగులేని స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోలకు సైతం చెమటలు పట్టిస్తున్న ఏకైక తెలుగు హీరోగా కూడా ఒక మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో ప్రభాస్ పెను ప్రభంజనాన్ని సృష్టించాడనే చెప్పాలి.

    ఇక బాహుబలి 2 సినిమా 2000 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన మూడు సినిమాలు భారీ డిజాస్టర్లను అందుకున్నాయి. దాంతో ప్రభాస్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఆయన సలార్ సినిమాతో భారీ సక్సెస్ ను తన కథలో వేసుకున్నాడు. ఈ సినిమా 700 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఇండియా లోనే టాప్ టెన్ భారీ సక్సెస్ లు సాదించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ వాళ్ళ పెదనాన్న అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ ను ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ మొదట్లో ప్రభాస్ కు సినిమాల్లోకి రావడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదంట, ఎందుకంటే ప్రభాస్ కు మొదటి నుంచి డాన్స్ పెద్దగా రాదు, నటన అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది.

    అయినప్పటికీ హీరో అంటే డ్యాన్స్ చాలా ముఖ్యం. కానీ డ్యాన్సులు చేయడం ఆయనకి రాదు. ఇక అప్పటికే చిరంజీవి లాంటి స్టార్ హీరో డాన్స్ లతో కుమ్మేస్తున్నాడు. కాబట్టి డాన్స్ లు చేయడం తన వల్ల కాదనే ఉద్దేశ్యం తోనే ఆయన ఇండస్ట్రీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. కానీ కృష్ణంరాజు మాత్రం తన తర్వాత వాళ్ల ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ ఇష్టం లేకపోయిన కూడా ప్రభాస్ ని పట్టుబట్టి మరి ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. ఇక మొదటి రెండు సినిమాల్లో తను ఇష్ట పూర్వకంగా నటించలేదనే వార్తలు కూడా అప్పట్లో భారీ ఎత్తున వచ్చాయి. కానీ వర్షం సినిమా సక్సెస్ తో ఆయన సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశాడు.

    ఇండస్ట్రీ లో వాళ్ల పెదనాన్న పేరు నిలబెట్టాలని, అలాగే తనకి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆయన సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి మరి డాన్స్ లు కూడా ప్రాక్టీస్ చేశాడు. ఇక మొత్తానికైతే స్టార్ హీరోగా గుర్తింపు పొందడమే కాకుండా, ఇప్పుడు పాన్ ఇండియాలో తన సత్తా చాటుతున్నాడు…