Prabhas Vs Allu Arjun Fans: తెలుగు సినిమా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన వాళ్లలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేస్తున్న హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇప్పటివరకు అందరికంటే ఎక్కువ పాన్ ఇండియా సినిమాలను చేసి ఎక్కువ సక్సెస్ లను సాధించాడు. అయితే బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ హీరో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ లాంటి రెండు భారీ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ లాంటి హీరో ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రభాస్ తో పాటు మరి కొంతమంది స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…
పుష్ప సినిమాతో ఎక్కడలేని గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ సైతం భారీ ఇమేజ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని నెక్స్ట్ లెవెల్లో నిలిపాయి. ఇక అలాంటి అల్లు అర్జున్ కి ప్రభాస్ పోటీ కానే కాదు అంటూ తన అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ప్రభాస్ తో పోటీపడే రేంజ్ లో అల్లు అర్జున్ ఉన్నప్పటికి ప్రభాస్ ను ఢీకొట్టే అంత కెపాసిటి ప్రస్తుతం అల్లు అర్జున్ కైతే లేదని కొంతమంది అంటున్నారు. కారణం ఏంటి అంటే అల్లు అర్జున్ తో పోలిస్తే ప్రభాస్ కి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనే టాప్ హీరో తనకంటే ఎవరికి ఎక్కువ అభిమానులు లేరు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అంటూ మరికొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక రాబోయే రోజుల్లో ఎవరైతే భారీ విజయాలను సాధించి ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తారో వాళ్లే నెంబర్ వన్ పొజిషన్ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే వీళ్లిద్దరితో పాటు మరికొంతమంది నెంబర్ వన్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో ఎవరు సక్సెస్ సాధిస్తారు ఎవరు నెంబర్ వన్ పొజిషన్ కి చాలా దగ్గరగా వస్తారు. ఎవరు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో గా మారతారు అనేది తెలియాల్సి ఉంది…
