spot_img
Homeఎంటర్టైన్మెంట్Kalki Movie Story: కల్కిలో ప్రభాసే విలన్... పార్ట్ 1 కథ ఇదే!

Kalki Movie Story: కల్కిలో ప్రభాసే విలన్… పార్ట్ 1 కథ ఇదే!

Kalki Movie Story: కల్కి 2829 AD విడుదలకు సమయం దగ్గరపడుతోంది. మూవీ ఎలా ఉంటుందనే ఆత్రుత ప్రేక్షకుల్లో అధికం అవుతుంది. అదే సమయంలో అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కల్కి మూవీలో ప్రభాస్ విలన్ అంటూ ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చింది. కల్కి పార్ట్ 1 కథ ఇదే అని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ కల్కి మూవీలో విలన్ అనే వాదనకు బీజం ఎక్కడ పడింది. ఆధారాలు ఏమిటీ?

ప్రభాస్ గతంలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా బిల్లా లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. మారణాయుధాలు సప్లై చేస్తూ బిల్లా ఇంటర్ పోల్ అధికారుల హిట్ లిస్ట్ లో ఉంటాడు. అలాగే సాహో చిత్రంలో కూడా ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఆయన పాత్ర మోసపూరితంగా సాగుతుంది. అతడు దొంగ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తారు.

Also Read: Sandeep Reddy-Allu Arjun: సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ చేసే సినిమా స్టోరీ ఇదే..?

కల్కి చిత్రంలో సైతం ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో కలిగి ఉంటుందని ట్రైలర్ విడుదలతో క్లారిటీ వచ్చింది. ట్రైలర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన కథ ప్రకారం… భైరవ(ప్రభాస్)కి ఒక లక్ష్యం ఉంటుంది. అది కాంప్లెక్స్ అనే ప్రపంచానికి వెళ్ళాలి. అందుకు వన్ మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్(చెప్పాలంటే డబ్బులు) కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడడు.

కాంప్లెక్స్ కి యాస్కిన్ అధిపతి. తన ఆధిపత్యం కొనసాగాలి అంటే పద్మ(దీపికా పదుకొనె) కడుపులో ఉన్న బిడ్డ యాస్కిన్ కి కావాలి. పద్మను యాస్కిన్ కి అప్పగించే బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే పద్మకు రక్షకుడిగా అశ్వద్ధామ(అమితాబ్) ఉంటాడు. ఈ క్రమంలో అశ్వద్ధామ-భైరవ మధ్య పోరు మొదలవుతుంది. మొత్తంగా కల్కి పార్ట్ 1 కథ ఇది. ట్రైలర్ లో భైరవ క్యారెక్టర్ ని నెగిటివ్ గానే ప్రొజెక్ట్ చెశారు.

Also Read: Kannappa Movie: ప్రభాస్ వల్లే విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నాడా..?

భైరవ యాంథమ్ పేరుతో విడుదల చేసిన సాంగ్ లిరిక్స్ గమనిస్తే.. భైరవ ఒక స్వార్థపరుడు. తన సుఖమే ముఖ్యం, ఇతరుల గురించి ఆలోచించడు అన్నట్లుగా ఉన్నాయి. ట్రైలర్, భైరవ యాంథమ్ సాంగ్ ఆధారంగా చూస్తే కల్కి మూవీలో ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. జూన్ 27న దీనిపై క్లారిటీ రానుంది.

RELATED ARTICLES

Most Popular