Prabhas Upcoming Movies: మిర్చి అనంతరం ప్రభాస్(Prabhas) సినిమాలు నత్త నడకన సాగాయి. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్లు కేటాయించాడు. మిర్చి విడుదలైన రెండేళ్లకు బాహుబలి… మరో రెండేళ్లకు బాహుబలి 2 థియేటర్స్ లోకి వచ్చాయి. బాహుబలి 2 తర్వాత అయినా ప్రభాస్ వేగంగా చిత్రాలు చేస్తారు అనుకుంటే అలా జరగలేదు. సాహోకి మరో రెండేళ్ల సమయం తీసుకున్నారు. ఒక దశలో ప్రభాస్ ఫ్యాన్స్ విసిగిపోయారు. మీరు వేగంగా చిత్రాలు చేయాలని ప్రభాస్ కి అభిమానులు సూచనలు చేశారు. అభిమానుల అసహనం పై స్పందించిన ప్రభాస్ ఏడాదికి కనీసం ఒక సినిమా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటాను అన్నారు.
అభిమానుల ఒత్తిడి వలన కావచ్చు, లేదా మంచి స్క్రిప్ట్స్ వదులుకోవడం ఇష్టం లేకనో.. ఏక కాలంలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్రభాస్ ఓకే చేస్తున్నారు. 2023లో ప్రభాస్ నుండి రెండు చిత్రాలు రావడం విశేషం. ఆదిపురుష్, సలార్ చిత్రాలతో ప్రభాస్ ఆ ఏడాది థియేటర్స్ లో సందడి చేశాడు. 2024లో కల్కి 2829 AD తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మూవీ వెయ్యి కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. సలార్, కల్కి సెట్స్ మీద ఉన్నప్పుడే ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్ చిత్రాలకు సైన్ చేశాడు.
Also Read: అఖండ 2తో భారీ రిస్క్ చేస్తున్న బాలయ్య, సాధ్యమయ్యే పనేనా?
అనూహ్యంగా మధ్యలో హను రాఘవపూడికి ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం రాజాసాబ్, హను రాఘవపూడి మూవీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. అదే సమయంలో సలార్ 2, కల్కి 2 చేయాల్సి ఉంది. మరోవైపు స్పిరిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సలార్ 2 ఆలస్యం కానుంది. కారణం… దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే కల్కి 2, స్పిరిట్ చిత్రాల విషయంలో కన్ఫ్యూషన్ నెలకొంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రానికి దర్శకుడు కాగా, సెప్టెంబర్ లో చిత్రీకరణ మొదలుపెడతామని అంటున్నారు. కల్కి 2 నిర్మాత అశ్వినీ దత్ సైతం కల్కి 2 అదే నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు ప్రభాస్ ముందు చేసేది కల్కి 2నా లేక స్పిరిట్ నా? అనే చర్చ మొదలైంది.
Also Read: చ చ.. దమ్ముంటే ఈ పదాలతో పాట రాయి పదానికి రూ.1000 ఇస్తా.. రైటర్ కు స్టార్ ప్రొడ్యూసర్ సవాల్…
ఏక కాలంలో పలు చిత్రాలు ప్రకటిస్తూ నిర్మాతలను ప్రభాస్ అయోమయానికి గురి చేస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయనకు కూడా క్లారిటీ లేదంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో ప్రభాస్ కొంచెం ప్రణాళికాబద్దంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్ చేసేవన్నీ వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే భారీగా ఖర్చు అవుతుంది. అదే సమయంలో స్టార్ హీరోలు ఏడాదికి రెండు చిత్రాలు చేస్తేనే థియేటర్స్ మనుగడ అనే వాదన తెరపైకి రావడం విశేషం.