Prabhas movie plans : ప్రభాస్ పేరు చెబితే చాలు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియాలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఒకవేళ ఆయన సినిమాకి సక్సెస్ ఫుల్ టాక్ రాకపోయినా కూడా ఆ సినిమాలు భారీగా కలెక్షన్స్ ను వసూలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న హీరో ప్రభాస్ (Prabhas)…బాలీవుడ్ హీరోలకు సైతం చుక్కలు చూపిస్తూ వాళ్ల పేరు మీద ఉన్న రికార్డ్ లను తన పేరు మీద మార్చుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియాలో ఉన్న డైరెక్టర్లు అందరు అతనికి కథలను వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన మాత్రం సెలెక్టెడ్ గా సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటికే చాలామంది ఆయనకి కథలను చెప్పారట. కానీ ఆయనకు మాత్రం వాళ్ళు చెప్పిన కథలు పెద్దగా నచ్చకపోవడంతో ఏ కథని ఫైనల్ చేయలేదు. మరి ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరు అతని చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు. ఆయనకు మంచి గుర్తింపు లభిస్తుందా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
Also Read :ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఇక ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఇప్పటికే ఆయన లైనప్ లో నాలుగు సినిమాలు ఉన్నాయి.అవి ఫినిష్ చేసిన తర్వాత తన కొత్త సినిమాని అనౌన్స్ చేయాలని చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం దర్శకులు చెబుతున్న కథలను వింటూ నచ్చిన కథను ఫైనల్ చేసి పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఆయన కోసం అన్ని రోజులపాటు వెయిట్ చేయకుండా ఇతర కథలతో వేరే సినిమాలు చేసుకొని ఆ తర్వాత ఈ సినిమాని చేద్దామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. అందుకోసమే ఆయన చాలామంది దర్శకులు చెప్పే కథలను అయితే వింటూ వస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
లేకపోతే మాత్రం ఆయన సినిమా కెరియర్ అనేది చాలా వరకు డౌన్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇక ప్రస్తుతం తనను తాను ఇండియాలో నెంబర్ వన్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలంటే మాత్రం తన తదుపరి సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరం కూడా ఉంది…