
వచ్చే నెలలో షూటింగ్‌లను తిరిగి ప్రారంభించాలని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లు తమ సిబ్బందికి టీకాలు పెద్దఎత్తున వేయిస్తూ వారిని షూటింగ్ లకు రెడీ చేస్తోంది., ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి టాలీవుడ్ నిర్మాతలు ఇలా తమ షూటింగ్ లో పాల్గొనే వార్డ్ బాయ్ నుంచి దర్శకుడి వరకు టీకాలు వేయిస్తూ షూటింగ్ లకు అంతరాయం లేకుండా ముందుకు సాగేందుకు ముందస్తు ప్రణాళికతో వెళుతున్నాయి.
“రాధే శ్యామ్” బృందం జూలైలో షూటింగ్ ప్రారంభించే ప్రయత్నాలను కూడా చేస్తోంది. సినిమా పూర్తి కావడానికి మిగిలి ఉన్న పాటను.. ప్యాచ్ వర్క్ ను అత్యవసరంగా పూర్తి చేయాలని దర్శకుడిని హీరో ప్రభాస్ కోరినట్టు సమాచారం. తద్వారా సినిమా విడుదల చేసే ప్రణాళికలను నిర్ణయించుకోవచ్చని అంటున్నారు.
“రాధే శ్యామ్” అతిపెద్ద పాన్-ఇండియన్ ప్రాజెక్టులలో ఒకటి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంస్థ టి సిరీస్ దాని హిందీ హక్కులను పొందింది. నిర్మాతలు ఒటిటి మరియు థీయేటర్లలో ఓకేసారి విడుదల చేయడానికి నిర్ణయించారు. ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.
కాబట్టి “రాధే శ్యామ్” షూట్ పూర్తి చేయడం ప్రభాస్‌కు అత్యంత ప్రాధాన్యతగా మారింది. ఎందుకంటే రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీలను ఒప్పుకున్నాడు. అందువల్ల అతను రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలను త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని ప్రభాస్ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.