Homeఎంటర్టైన్మెంట్నేషనల్ స్టార్ తో చిన్న సినిమా ఏంటో ?

నేషనల్ స్టార్ తో చిన్న సినిమా ఏంటో ?

Prabhas Prashanth Neel
కేజీఎఫ్‌ నిర్మాణ సంస్థ నుండి మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ను ప్రకటించబోతున్నారని అధికారిక ప్రకటన రాగానే ఈ సినిమా పై అనేక రకాలుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. పైగా ఈ సినిమా చేయబోతున్నది ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్ లో అని కన్నడ మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కోడై కూస్తుంది. దాంతో ఈ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేసింది. అయితే ప్రస్తుతం ప్రభాస్‌ ఉన్న బిజీకి ప్రశాంత్‌ నీల్‌ కు రెండేళ్ల వరకు డేట్లు ఇస్తాడా..? అయినా ప్రశాంత్‌ నీల్‌ తదుపరి సినిమాను ఎన్టీఆర్ తోనే చేయాలనుకుంటున్నాడు అని ఇప్పటికే ప్రచారం కూడా జరిగింది.

Also Read: ‘నయనతార’లా జాన్వీ కపూర్ మెప్పిస్తోందా ?

కానీ, ప్రభాస్‌ తో ప్రశాంత్‌ నీల్‌ చేయబోతున్న సినిమా ఆరు ఏళ్ల క్రితం వచ్చిన ‘ఉగ్రమ్‌’ కు రీమేక్‌ అని వార్తలు రావడం మరీ విచిత్రంగా ఉంది. అయితే, హిందీ మరియు తెలుగులో ఒకే సారి ఈ సినిమాను రీమేక్‌ చేయాలని ప్రశాంత్ నీల్‌ భావిస్తున్నట్లు… ప్రశాంత్‌ కెరీర్‌ ఆరంభంలో ఉగ్రమ్‌ ను చేశాడు కాబాట్టి.. తనకు ఈ సినిమా పై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ సినిమా చాల స్పీడ్ గా అయిపోతుందని.. అందుకే ఈ సినిమాకి ప్రభాస్ కూడా డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్. ఇక ఈ సినిమా కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తీస్తే అప్పట్లోనే అయిదు రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టడంతో ఈ సినిమా పై బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఉన్నారు.

Also Read: చిరు లేకుండానే షూట్ చేసేశారు !

మరి సెన్షేషనల్‌ మూవీగా నిలిచిన ఈ ఉగ్రమ్‌ సినిమా హిందీ మరియు తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ ఆకట్టుకుంటుందో చూడాలి. కానీ నేషనల్ స్టార్ లాంటి ప్రభాస్‌ తో చిన్న సినిమాని పైగా రీమేక్‌ మూవీ చేయడం ఏంటో అంటూ అభిమానులు కొందరు పెదవి విరిస్తున్నారు. మరికొందరు అయితే ఈ సినిమా అనేది నమ్మశక్యం కాదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా పై ఫుల్ క్లారిటీ రావాలంటే.. అసలు విషయం రేపు మద్యాహ్నం రెండు గంటలకు క్లారిటీ వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version