గ్రేటర్ ఎన్నికల పోలింగ్ నేడు జరుగుతోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం వరకు కూడా ఓటింగ్ శాతం పెద్దగా పుంజుకోలేదు. దీంతో ఈసారి పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే తక్కువగా నమోదయ్యేలా కన్పిస్తున్నాయి.
Also Read: పార్టీలకు నగరవాసుల జలక్.. ఒక్కశాతం కూడా మించని ఓటింగ్..!
మధ్యాహ్నం 3గంటల వరకు కూడా కేవలం 25.34శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. మరో రెండు గంటల్లో ఎన్నికలు ముగియనుండటంతో ఈసారి పోలింగ్ శాతం దారుణంగా పడిపోయేలా కన్పిస్తోంది. నగరంలో జరిగే ప్రతీ ఎన్నికలోనూ నగరవాసులు 50శాతానికి పైగా ఓటింగ్ పాల్గొంటుడం చూస్తున్నాం.
కాగా ఈసారి నగరవాసులు కనీసం పోలింగ్ కేంద్రాలవైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. అత్యధిక విద్యావంతులున్న హైదరాబాద్లోనే పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకున్న వాళ్లే బాధ్యతను తమ బాధ్యతను విస్మరిస్తే ఎలా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.
Also Read: రాజకీయాల్లో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ నయమా?
ఇదిలా ఉంటే 80ఏళ్ల బామ్మ తమ ఓటుహక్కును వినియోగించుకొని అందరికీ బాధ్యతను గుర్తుచేసింది. ఈ బామ్మ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేసిన విషయాన్ని ఆమె మనువరాలు పద్మశ్రీ ట్వీటర్లో పోస్టు చేసింది. ‘లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మా అమ్మమ్మ బయటకు రాలేదని.. తొలిసారి ఓటు వేసేందుకు బయటకు వచ్చిందంటూ’ పద్మశ్రీ ట్వీట్ చేసింది.
ఈ పోస్టుపై మంత్రి కేటీఆర్.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ లైక్ కొట్టి షేర్ చేశారు. 80ఏళ్ల వయస్సులోనూ ఈ బామ్మ అందరి బాధ్యతను గుర్తుచేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బామ్మను చూసైనా నగరవాసులు మెల్కొంటారా? లేదో వేచిచూడాల్సిందే..!
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
@KTRTRS Sir happy to share that my Ammamma who is 80 years old stepped out of Home after 22/03/2020 for the First time today to Vote for TRS 🙏🏻🙏🏻❤️❤️ #GHMCElections2020 pic.twitter.com/hsxnAQib9M
— Shree (@padmasree_111) December 1, 2020