The Raja Saab: వణుకు పుట్టిస్తున్న ‘రాజాసాబ్’ లేటెస్ట్ టీజర్..దెయ్యం లుక్ లో ప్రభాస్ అదుర్స్!

హారర్ థ్రిల్లర్ జానర్ లో మన టాలీవుడ్ నుండి నేటి తరం స్టార్ హీరోలలో తొలిసారి ప్రభాస్ మాత్రమే చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం.

Written By: Vicky, Updated On : October 23, 2024 2:48 pm

The Raja Saab(1)

Follow us on

The Raja Saab: ‘కల్కి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ డైరెక్టర్ మారుతీ తో ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని కొన్ని నెలల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. చాలా స్టైలిష్ గా కనిపించిన ప్రభాస్ ని చూసి ఆయన అభిమానులు ఎంతో మురిసిపోయారు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అవ్వడంతో తెలుగు నేటివిటీ కి తగ్గ సినిమాల కోసం అభిమానులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఈ ‘రాజా సాబ్’ చిత్రం ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.

అంతే కాకుండా హారర్ థ్రిల్లర్ జానర్ లో మన టాలీవుడ్ నుండి నేటి తరం స్టార్ హీరోలలో తొలిసారి ప్రభాస్ మాత్రమే చేస్తున్నాడని అభిమానులు అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది మూవీ టీం. రెండు రోజుల క్రితమే ప్రభాస్ స్టైలిష్ లుక్ తో ఉన్న పోస్టర్ ని విడుదల చేసిన మూవీ టీం, ఇప్పుడు సినిమాలోని ప్రభాస్ రెండవ క్యారక్టర్ కి సంబంధించిన లుక్ ని విడుదల చేసింది. వయస్సు మళ్ళిన రాజు గా, స్టైల్ గా నోట్లో సిగార్ కాలుస్తూ,కుర్చీలో కూర్చున్న ప్రభాస్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇందులో ప్రభాస్ దెయ్యం రోల్ లో కూడా కనిపిస్తాడని ఈ మోషన్ పోస్టర్ చూసిన తర్వాత అభిమానులకు, ప్రేక్షకులకు క్లారిటీ వచ్చింది. ఇలాంటి గెటప్ లో తమ అభిమాన హీరోని చూస్తామని ప్రభాస్ అభిమానులు కలలో కూడా ఊహించి ఉండరు. డైరెక్టర్ మారుతీ తనకి వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సరైన పద్దతి లో ఉపయోగించి, ఈ సినిమాకోసం తన టాలెంట్ ని మొత్తం ఉపయోగించేసాడని తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు అభిమానుల్లో పెద్దగా ఆసక్తి, అంచనాలు ఉండేవి కాదు. ఎందుకంటే డైరెక్టర్ మారుతీ కి అంతకు ముందు వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. పైగా అతనితో సినిమాలు చేసేందుకు మీడియం రేంజ్ హీరోలు కూడా ఆలోచిస్తారు, అలాంటిది పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ అవకాశం ఇవ్వడం ఏమిటి?, ఈ సినిమా మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ చిత్రం నుండి వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేలా చేస్తున్నాయి. చూస్తుంటే ప్రభాస్ ఈ సినిమా తో కూడా పాన్ ఇండియా లెవెల్ లో కుంభస్థలం బద్దలు కొట్టేలా ఉన్నాడని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో మైలు రాయిగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.