MVV Satyanarayana : ఆ దెబ్బతో.. విశాఖ మాజీ ఎంపీ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డు పడినట్టేనా?

అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరు. అప్పుడు తప్పులు ఉన్నా పెద్దగా పట్టించుకునే వారు ఉండరు. ఒకసారి చేతి నుంచి పవర్ మిస్ అయితే మాత్రం.. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు విశాఖ మాజీ ఎంపీ వి సత్యనారాయణ.

Written By: Dharma, Updated On : October 23, 2024 2:46 pm

MVV Satyanarayana

Follow us on

MVV Satyanarayana : విశాఖ మాజీ ఎంపీ, వైసీపీ నేత ఎంవివి సత్యనారాయణ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనిపిస్తోంది. వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు సత్యనారాయణ. గత రెండు దశాబ్దాలుగా విశాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి కేవలం 3000 ఓట్లతో.. టిడిపి అభ్యర్థి శ్రీ భరత్ పై గెలుపొందారు.అయితే గత ఐదేళ్లుగా ఎం వివి చేసిన తప్పిదాలతో ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట. కంటికి కనిపించిన స్థలాలను కబ్జాలు చేస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించిన ఆయనకు ఇప్పుడు కేసులు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆయనపై జరిగిన ఈడి దాడుల్లో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఏకంగా నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసే మిషన్ దొరకడం విశేషం. దీంతో ఈ మాజీ ఎంపీ రాజకీయ జీవితంతో పాటు వ్యాపార సామ్రాజ్యం సైతం కూలిపోయే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దాదాపు 20 సంవత్సరాలుగా ఆయన బిల్డర్ గా ఉన్నారు.రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నారు. సినిమా ప్రొడ్యూసర్ గా మారి పలు చిత్రాలను కూడా తీశారు. సాగరనగరంలో పెద్ద బిగ్ షాట్ గా ఎదిగారు. విశాఖ నగరంలో భారీ భవంతులు నిర్మించింది ఆయనే. ఆయన నిర్మించిన ప్లాట్లను కొనుగోలు చేయాలంటే కోట్లలో మాటే. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది.అప్పట్లో ఉత్తరాంధ్రాకు చెందిన ఓ మంత్రితో వివాదం నడిచింది. అదే ఆయన వైసీపీ వైపు అడుగులు వేసేలా చేసింది. అయితే భారీ వ్యాపారానికి ఎంపీ పదవి తోడు కావడంతో గత ఐదేళ్లుగా ఆయన చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఖాళీగా కనిపించే సైట్లు పై కన్నేయడం.. వివాదాలు సృష్టించి సొంతం చేసుకోవడం పరిపాటిగా మారింది.అయితే ఈ విషయంలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తో సైతం వివాదాలు చేసుకున్నారు ఎంవివి. అదే ఊపుతో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిపోతానని భావించారు ఆయన. జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు.

* టిడిపిలో చేరేందుకు ప్రయత్నం
అయితే వైసిపి ఓడిపోయిన తర్వాత ఎం వి వి టిడిపిలో చేరేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దీనికోసం కులం కార్డును సైతం వాడారు. అయితే గత ఐదేళ్లుగా ఆయన వ్యవహార శైలి తెలిసినా టిడిపి నేతలు అడ్డుకట్ట వేశారు. అది వర్కౌట్ కాలేదు సరి కదా.. పాత కేసులకు సంబంధించి ఈడి ఎంటర్ అయ్యింది. సమగ్ర దర్యాప్తు చేసింది. దాదాపు విశాఖ నగరంలో పేరుమోసిన సంస్థలు సైతం బాధితులుగా మిగలడంతో.. అందరికన్ను ఎం వి వి పై పడింది. ఇన్ని రోజులు పొలిటికల్ పైరవీలు చేసుకుంటూ ముందుకు సాగిన ఆయన.. ఈసారి మాత్రం కేసులను ఎదుర్కోక తప్పలేదు. అయితే ఈ కేసుల్లో అరెస్టు తప్పవు అన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించినట్లు కూడా ప్రచారం సాగింది.

* కీలక పత్రాలు,మిషన్లు స్వాధీనం
అయితే వైసీపీ ఓడిపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అది వర్కౌట్ కాకపోయేసరికి బిజెపిలో జాయిన్ అయ్యేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయితే ఏపీలో ఉన్నది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అనుమతి లేకుండా కేంద్రం పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు. దీంతో డిప్రెషన్ లో ఉన్నారు ఎం వివి. ఇటువంటి పరిస్థితుల్లో ఈడి రంగంలోకి వచ్చింది. ఏకకాలంలో నివాసాలతో పాటు కార్యాలయాలపై దాడి చేసింది. సన్నిహితుల ఇళ్లలో సైతం తనిఖీలు చేసింది. నకిలీ స్టాంప్ పేపర్లు తయారు చేసే డిజిటల్ డివైసులు, నకిలీ డాక్యుమెంట్ తయారు చేసే మిషన్లు, బినామీ పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఇలా చాలా పట్టుబడినట్లు సమాచారం. దీంతో ఎంవివి పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డు పడేలా కేసులు మరింత బిగిసికోనున్నాయి. ఎటు తప్పించుకోలేని స్థితిలో ప్రస్తుతం ఎం వి వి ఉన్నట్లు తెలుస్తోంది.