https://oktelugu.com/

Prabhas : ఫౌజీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే...

Written By: , Updated On : February 10, 2025 / 09:06 AM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటు ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ప్రభాస్ కి పోటీ వచ్చే హీరో అయితే మరెవరు లేరు అనేది వాస్తవం… యంగ్ రెబల్ స్టార్ గా గొప్ప గుర్తింపుని సంపాదించుకున్న ఆయన ఇకమీదట కూడా భారీ విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతు ఉండటం విశేషం…

హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన హను రాఘవపూడి ప్రభాస్ (Prabhas) తో సినిమా చేస్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిన సినిమాలే కావడం విశేషం…అలాగే ప్రభాస్ స్టార్ డమ్ ను మ్యాచ్ చేసే కథను తయారు చేసుకొని స్టార్ హీరోతో ఏ సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందో అలాంటి ఒక కథతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ప్రస్తుతం ఫౌజీ అంటూ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఒక కథను రాసుకున్న హను రాఘవపూడి ఎంతయితే ఇంటెన్స్ తో కథను రాసుకున్నాడో అదే ఇంటెన్స్ తో సినిమాను తీసే ప్రయత్నమైతే చేస్తున్నాడు…ఇక ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రో్ల్ లో నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి దీని మీద దర్శకుడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన కూడా ఆర్మీ ఆఫీసర్ గా ఉంటున్న ప్రభాస్ లానే మరొక దేశంలో మరొక వ్యక్తి కూడా ఉంటారట. మరి వీళ్లిద్దరి మధ్య ఒక బీకరమైన పోటీ కూడా జరగబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరూ అన్నదమ్ముల లేదంటే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉన్నట్టుగా అందులో వీళ్ళిద్దరూ కూడా ఒకరా అనేది తెలియాల్సి ఉంది.

మరి ఏది ఏమైనా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటున్న ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ని సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ ప్రస్తుతానికైతే ఈ సినిమాకి తన డేట్స్ మొత్తాన్ని కేటాయించాడు.

ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ‘స్పిరిట్ ‘ (Spirit) సినిమా మీద తన డేట్స్ ని ఇవ్వబోతున్నాడట. మరి ఏది ఏమైనా కూడా వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ ఏ హీరోకి అందనంత ఎత్తులో ముందుకు సాగుతూ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతున్నాడు.

మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు…మరి ఈ సినిమాలో నిజంగానే ఇద్దరు ప్రభాస్ లు ఉన్నారా? లేదంటే కావాలనే ఇలాంటి వార్తలు వైరల్ చేస్తున్నారా అనేది తెలియాలంటే మాత్రం సినిమా యూనిట్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంది. చూడాలి మరి సినిమా యూనిట్ ఈ వార్తల మీద ఎలా స్పందిస్తారు అనేది…