OG
OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అటు రాజకీయంగాను, ఇటు సినిమాల పరంగా చాలా వరకు ముందుకు సాగుతున్నాడు. ఇక ఏపీలో డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ పేదలకు న్యాయాన్ని చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే ఉంటే మాత్రం ఆయన కచ్చితంగా సీఎం అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు సినిమాలను కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమాని అనుకున్న సమయానికి థియేటర్లోకి తీసుకురావడానికి ఆయన అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా సుజీత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓ జి సినిమాని కూడా తొందరలోనే రిలీజ్ కి రెడీ చేయబోతున్నారట. ఇక పవన్ కళ్యాణ్ మరొక 15 రోజులు ఆ సినిమా మీద డేట్స్ కేటాయిస్తే పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసి మిగతా షూట్ ను కూడా ఫినిష్ చేసి దర్శకుడు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఫైట్ అయితే అద్భుతంగా ఉండబోతుందంటూ దర్శకుడు సుజీత్ కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వంద మందితో ఫైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మగధీర (Magadheera) సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) 100 మందిని ఎలాగైతే నరికాడో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ ఫైట్ సీన్ ను డిజైన్ చేశారట. ఈ ఫైట్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం పూనకాలు వస్తాయని డైరెక్టర్ చెప్తున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకుడు ఈ సినిమా మీద రోజు రోజుకి హైప్ అయితే పెంచుతున్నాడు. ఇక రామ్ చరణ్ 100 మందిని చంపినట్టుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ వందమందితో ఒంటరిగా పోరాటం చేస్తూ ముందుకు సాగుతారట. నిజజీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరి డిప్యూటీ సీఎం గా ఎదిగాడు.
కాబట్టి సినిమాలో కూడా అతనికి శత్రువులు ఎదురుపడ్డప్పుడు వాళ్లని భౌతికంగా వాళ్ళతో ఫైట్ చేసి ఎలా గెలిచాడు అనే పాయింట్ ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఈ సీని డిజైన్ చేశారట. మరి మొత్తానికైతే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవబోతుందంటూ డైరెక్టర్ సుజీత్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా సందర్భాల్లో తెలియజేస్తూ ఉండడం విశేషం…