Prabhas Spirit Movie: అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డివంగా…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషల్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలే అయినప్పటికి ఆ మూడు కూడా సూపర్ సక్సెస్ ని సాధించాయి. అలాంటి సందీప్ రెడ్డివంగా ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. తన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో చేసిన ‘స్పిరిట్’ సినిమాలో కూడా ఆయన డిఫరెంట్ మేకింగ్ స్టైల్ ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫిషర్ గా కనిపించబోతున్నాడు.
ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ కి వివేక్ ఒబెరాయ్ కి మధ్య ఉండే సంబంధం ఏంటి? వీళ్లిద్దరి మధ్య గొడవలు ఏంటి అనే విషయం మీదనే ఈ సినిమా మొత్తం నడుస్తుందట. నిజానికి వివేక్ ఒబెరాయ్ ఒక డ్రగ్ సప్లై చేసే కంపెనీకి ఓనర్ గా ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రభాస్ వస్తాడు.
అతన్ని ఎలా పట్టుకున్నాడు. వీళ్లిద్దరు ఎవరికి వాళ్ళు ఎలాంటి ఎత్తులు వేసుకున్నారు. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు అనేది కూడా ఈ సినిమాలో చాలా బలంగా చూపించబోతున్నారట. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేనట్టుగా చూపించినప్పటికి ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ గా ఉంటారనే ఒక న్యూస్ బయటికి వినిపిస్తుంది.
ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు గానీ మొత్తానికైతే సోషల్ మీడియాలో స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఒక కథతో పాటు ప్రభాస్, వివేక్ ఒబెరాయ్ లకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనే దాని మీద కూడా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది…ఇక వీటన్నింటికి ఒక క్లారిటి దొరకాలంటే మాత్రం ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…
