Prabhas Spirit Movie Villain: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)… ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji)అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. మరి ఇలాంటి క్రమం లోబి వారి అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
అయితే ఈ సినిమా దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ ఇప్పటివరకు చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఆయన ముందు వరుసలో ఉన్నాడు. పాన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో అతనితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేస్తున్న ఆయన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా రెండువేల కోట్లకు పైన కలెక్షన్స్ ను అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన చేసిన అనిమల్ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక దానికి మించి ఈ సినిమాను డిజైన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన ఉన్నాడు. అందుకోసమే ఆయన ఈ సినిమా విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డేట్స్ ని కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. దాదాపు సంవత్సరన్నర పాటు ఈ సినిమా మీదనే ప్రభాస్ తన డేట్స్ ని కేటాయించాల్సిన అవసరమైతే ఉందట. మరి ఈ సినిమాలో స్టార్ హీరోతో విలన్ గా నటింప చేస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఆ హీరో ఎవరు ఎందుకు ఆయన చేతే విలన్ గా చేయిస్తున్నాడు. ఆయన పాత్రకి అంత ఇంపార్టెన్స్ ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక మొత్తానికైతే విలన్ గా చేసే ఆ నటుడు ఎవరు అనేది సినిమా షూట్ స్టార్ట్ చేసేటపుడు అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట…