Homeఎంటర్టైన్మెంట్Prabhas Shocking Comments On Puri Jagannadh: పూరి జగన్నాథ్ లాంటోడు ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు...

Prabhas Shocking Comments On Puri Jagannadh: పూరి జగన్నాథ్ లాంటోడు ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

Prabhas Shocking Comments On Puri Jagannadh: టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమయమైనా ఇమేజ్ ఉన్న దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్(Puri Jagannath). ఇప్పుడైతే ఆయన ఫార్మ్ లో లేడు కానీ, ఒకప్పుడు తెలుగు కమర్షియల్ సినిమాలో హీరోయిజానికి సరికొత్త నిర్వచనం తెలిపిన డైరెక్టర్ ఆయన. తక్కువ సమయం లో పదునైన డైలాగ్స్ రాసి, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమాని తీయడం లో పూరి జగన్నాథ్ ని మించిన వాళ్ళు ఇండియా లోనే లేరు. రీసెంట్ గా రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఆయన గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ సూపర్ హిట్ అయ్యాక ఆ మూవీ టీం ప్రభాస్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ లో ప్రభాస్ పూరి జగన్నాథ్ ప్రస్తావన వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట్లాడాడు.

ఆయన మాట్లాడుతూ ‘ పూరి జగన్నాథ్ లాంటి రచయితా ఈ ప్రపంచం లోనే లేరు అనేది నేను గట్టిగా నమ్ముతా. ఆయన నాకు ‘బుజ్జిగాడు’ మూవీ స్టోరీ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ఎలా చెయ్యాలి బాబోయ్ అని అప్పట్లో టెన్షన్ పడ్డాను. ఆ సినిమాని ఆడియన్స్ ఇప్పటికీ ఇష్టపడుతారు. ఈ చిత్రం తర్వాత నేను ఆయనతో కలిసి ‘ఏక్ నిరంజన్’ అనే సినిమా చేశాను. ఆయాలాగా డైలాగ్స్ రాసేవాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు. ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి’ అంటూ చెప్పుకొచ్చాడు పూరి జగన్నాథ్. ప్రభాస్ మాటలను బట్టీ చూస్తుంటే ఆయనకు పూరి జగన్నాథ్ అంటే ఎంత ప్రేమ అనేది స్పష్టంగా తెలుస్తోంది. కుదిరితే మరో అవకాశం కూడా ఇచ్చేలా ఉన్నాడు. కానీ ఇచ్చినప్పటికీ కూడా పూరి జగన్నాథ్ సినిమా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఫార్మ్ లో లేడనే విషయం ఆయనకు కూడా తెలుసు, అలాంటప్పుడు ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ని రిస్క్ లో పెట్టి సినిమా చెయ్యాలని మాత్రం అనుకోడు.

కానీ పూరి జగన్నాథ్, నా దగ్గర ఒక్క స్టోరీ ఉంది , ఒక్క అవకాశం ఇస్తావా డార్లింగ్ అని అడిగిన వెంటనే, ప్రభాస్ అవకాశం ఇచ్చేస్తాడు. ఆయన మనసు అంత గొప్పది. ఎంత గొప్పది కాకపోత, ఫ్లాపుల్లో ఉన్న మారుతి లాంటి డైరెక్టర్ కి తనతో సినిమా చేసే అవకాశం ఇస్తాడు చెప్పండి. ఇచ్చిన ఆ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోవడం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు మారుతీ. కానీ పూరి జగన్నాథ్ అలా కాదు , ఒకవేళ తనకు ప్రభాస్ అవకాశం ఇస్తే ప్రాణం పెట్టి పని చేస్తాడు. పూరి జగన్నాథ్ లో డైరెక్షన్ టాలెంట్ ఇంకా తగ్గలేదు. కేవలం స్టోరీలు సరిగా రాసుకోలేకపోతున్నాడంతే. కానీ ఒక మంచి స్టోరీ ని ఆయన చేతుల్లో పెడితే కచ్చితంగా అద్భుతమైన సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభాస్ భవిష్యత్తులో పూరి కి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version