https://oktelugu.com/

Prabhas Marriage: తన పెళ్లి పై ప్రభాస్ షాకింగ్ కామెంట్స్

Prabhas Marriage: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. రాధేశ్యామ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న డార్లింగ్‌కు.. ఈ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ముంబైలో ప్రీ రిలీజ్ ఈ వెంట్ గ్రాండ్‌గా జరుగుతున్న సందర్భంగా ఓ జర్నలిస్ట్ ప్రభాస్‌ను ‘ ట్రైలర్‌ 2 లో ప్రేమ గురించి ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అనే డైలాగ్ ఉంది. అయితే మీ రియల్ లైఫ్‌లో […]

Written By:
  • Shiva
  • , Updated On : March 3, 2022 / 08:06 AM IST
    Follow us on

    Prabhas Marriage: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. రాధేశ్యామ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న డార్లింగ్‌కు.. ఈ సినిమా కొత్త ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ముంబైలో ప్రీ రిలీజ్ ఈ వెంట్ గ్రాండ్‌గా జరుగుతున్న సందర్భంగా ఓ జర్నలిస్ట్ ప్రభాస్‌ను ‘ ట్రైలర్‌ 2 లో ప్రేమ గురించి ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు అనే డైలాగ్ ఉంది.

    Prabhas

    అయితే మీ రియల్ లైఫ్‌లో కూడా అలా ఎప్పుడైనా ప్రిడిక్షన్ తప్పు అయ్యిందా` అని అడిగారు. అందుకు ప్రభాస్ సమాధానమిస్తూ.. ‘చాలాసార్లు అయ్యింది. అందుకే నాకింకా పెళ్లి కాలేదు` అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ తాజాగా తన పెండ్లి గురించి ఇలా స్పందించడం ఆసక్తిని కలిగిస్తుంది.

    Also Read:  బన్నీ, పవన్, ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన ప్రభాస్ !

    అయితే, తన రియల్ లైఫ్‌లో కూడా ప్రేమ విషయంలో చాలాసార్లు ప్రిడిక్షన్ తప్పు అయ్యిందని ప్రభాస్ చెప్పడం, పైగా అందుకే నాకింకా పెళ్లి కాలేదు అని క్లారిటీ ఇవ్వడం ఒకవిధంగా షాకింగ్ విషయమే. గతంలో ప్రభాస్ అనుష్కతో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరి ఆ ప్రేమ మధ్యలో ఆగిపోయిందో.. లేక మరో సీక్రెట్ ప్రేమ విషయంలో ప్రభాస్ లవ్ ఫెయిల్ అయ్యాడో తెలియదు గానీ, మొత్తానికి ప్రభాస్ కి కూడా లవ్ ఫెయిల్యూర్ ఉంది అని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు.

    Prabhas

    ఐతే, ప్రభాస్ టీమ్ మాత్రం.. ప్రభాస్ సరదాగా ఇలా బదులిచ్చాడు అని.. ఈ విషయాన్ని మీరు సీరియస్ గా తీసుకోవద్దు అని జర్నలిస్టులకు చెబుతున్నారు. ఏది ఏమైనా 42 ఏళ్లు వచ్చినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండటం విశేషమే. ఇక ఈ నెల 11న ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం విడుదల కానుంది.

    Also Read: పవన్ కళ్యాణ్ యుద్ధం ఎప్పుడు చేస్తాడో తెలుసా?

    Tags