https://oktelugu.com/

Prabhas Sensational Comments: లవ్ స్టోరీలకు ఇక సెలవు.. ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్

Prabhas Sensational Comments: ఇటీవల విడుదల అయినా పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలలో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్..దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల రోజు మొదటి అట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది..ఇందువల్ల కేవలం ఓపెనింగ్స్ తప్ప కనీసం వసూళ్లను కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 10:23 AM IST

    Prabhas

    Follow us on

    Prabhas Sensational Comments: ఇటీవల విడుదల అయినా పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలలో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన చిత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్..దాదాపుగా 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదల రోజు మొదటి అట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది..ఇందువల్ల కేవలం ఓపెనింగ్స్ తప్ప కనీసం వసూళ్లను కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది..ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 200 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 80 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసి బయ్యర్లకు 120 కోట్ల రూపాయిల నష్టాల్ని ఇచ్చింది..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో భారీ నష్టాలు కలిగించిన సినిమాలలో ఈ చిత్రం టాప్ 1 గా నిలిచింది..ఈ మూవీ ఫలితం ప్రభాస్ ని చాలా బాధించినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన వార్త.

    Prabhas

    ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపుగా మూడేళ్ళ తన అమూల్యమైన సమయాన్ని ఇచ్చాడు..అభిమానులు కూడా తమ అభిమాన హీరో ని వెండితెర మీద చూసేందుకు మూడేళ్ళ నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూసారు..అందరూ ఇన్ని ఆశలు పెట్టుకున్న ఇలాంటి సినిమా ఫ్లాప్ అవ్వడం నిజంగా ఎంతో బాధాకరం..కానీ ఇక నుండి ప్రభాస్ లవ్ స్టోరీస్ చెయ్యకూడదు అనే దృఢమైన నిర్ణయం కి వాచినట్టు తెలుస్తుంది..బాహుబలి వంటి సినిమా తర్వాత తనని జనాలు కేవలం యాక్షన్ హీరో గా మాత్రమే చూస్తున్నారు అని..లవ్ స్టోరీస్ లో చూడడానికి అసలు ఇష్టం చూపించట్లేదు అని ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు అట ప్రభాస్..అందుకే తన ప్రస్తుత లైనప్ మొత్తం యాక్షన్ మూవీస్ తో నింపేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..ఎంటర్టైన్మెంట్ తో కూడిన మాస్ మూవీస్ మరియు కామెడీ ఎంటర్టైనర్ చెయ్యడానికి అయినా సిద్ధం కానీ లవ్ స్టోరీస్ మాత్రం ఇక చెయ్యదు అట ప్రభాస్..ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ప్రభాస్ ప్రస్తుతం KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..30 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమా తర్వాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ మారుతీ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అట..ఈ సినిమాకి రాజా డీలక్స్ నే పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం ..ప్రభాస్ లాంటి మాస్ హీరో తొలిసారి ఒక్క కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చెయ్యడానికి సిద్ధపడడం తో ఒక్కసారిగా అందరూ షాకింగ్ కి గురి అయ్యారు..ఇటీవల కాలం లో ప్రేక్షకులు మాస్ మరియు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు బ్రహ్మరధం పడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అందుకే ప్రభాస్ ఆ జానర్ ని ఎంచుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్త..ప్రస్తుతం సలార్ సినిమా తో పాటుగా ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలలో ప్రభాస్ నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూడు సినిమాలు పూర్తి అయినా తర్వాత ప్రభాస్ ఎక్కువగా మన తెలుగు నేటివిటీ కి దగ్గరగా ఉండే మాస్ యాక్షన్ సినిమాలలోనే నటించబోతున్నట్టు సమాచారం.

    Recommended Videos:

    Tags