https://oktelugu.com/

Nani Thaman: ముదురుతున్న హీరో నాని – థమన్ మధ్య వివాదం..అసలు ఏమి జరిగిందో తెలుసా??

Nani Thaman: టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ కి ఎలాంటి డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ ఈయనని తమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటున్నారు..అలా వైకుంఠపురం లో సినిమా మ్యూజిక్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన థమన్ ఆ సినిమా తర్వాత ఆయన పట్టుకున్న ప్రతి సినిమా బంగారం లాగ మారిపోయింది అనే చెప్పాలి..స్టార్ హీరోలకు మాత్రమే కాకుండా యువ హీరోల సినిమాలకు కూడా థమన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 26, 2022 / 10:30 AM IST
    Follow us on

    Nani Thaman: టాలీవుడ్ లో ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ కి ఎలాంటి డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ ఈయనని తమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటున్నారు..అలా వైకుంఠపురం లో సినిమా మ్యూజిక్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన థమన్ ఆ సినిమా తర్వాత ఆయన పట్టుకున్న ప్రతి సినిమా బంగారం లాగ మారిపోయింది అనే చెప్పాలి..స్టార్ హీరోలకు మాత్రమే కాకుండా యువ హీరోల సినిమాలకు కూడా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అయితే ఇటీవల ఈయనకి మరియు న్యాచురల్ స్టార్ నాని కి మధ్యలో మాటల యుద్ధం జరిగింది..సాధారణంగా హీరోలందరితో మంచి రిలేషన్ ని మైంటైన్ చేసే థమన్ ఇలా పరోక్షంగా ఒక్క హీరో పై సెటైర్లు వేసినట్టు చూడడం ఇదే తొలిసారి..ఇక అసలు విషయానికి వస్తే గత ఏడాది నాని హీరో గా నటించిన టాక్ జగదీశ్ సినిమా OTT లో విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..తొలుత ఈ సినిమాని థియేటర్స్ లో విడుదల చేద్దాం అని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ తర్వాత కరోనా రావడం..సినిమా వాయిదా పడడం తో OTT లో విడుదల చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి తొలుత సంగీత దర్శకుడిగా థమన్ ని తీసుకున్నారు..కొన్ని ట్యూన్లు కూడా చేయించుకున్నారు..కానీ హీరో నాని కి ఆ ట్యూన్లు నచ్చకపోవడం తో థమన్ కి వేరే ట్యూన్స్ ఇవ్వమని చెప్పాడట..అవి కూడా ఆయనకీ నచ్చకపోవడం తో నిర్మాతలతో మాట్లాడి తనతో ఎప్పటి నుండో ఒక్క సినిమాకి పని చెయ్యడం కోసం ఎదురు చూస్తున్న గోపి సుందర్ కి అవకాశం ఇప్పించి థమన్ ని తప్పించాడు అట నాని.

    Nani, Thaman

    తనని తప్పించినందుకు థమన్ ఏ మాత్రం ఫీల్ అవ్వలేదు అట..ఎందుకంటే అప్పటికే ఆయన చేతి నిండా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి..కానీ నాని ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై పరోక్షంగా పేరు ప్రస్తావించకుండా సెటైర్లు వేసాడు..దీనికి థమన్ కూడా తనదైన శైలిలో ట్విట్టర్ లో స్పందిస్తూ నాని పై పరోక్షం గానే విరుచుకు పడ్డాడు..అలా వీళ్లిద్దరి మధ్య ప్రారంభం అయినా వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..నాని లేటెస్ట్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ తీసుకోడానికి వెళ్లిన దర్శక నిర్మాతలకు నాని సినిమాకి తానూ పని చెయ్యను అని మొహమాటం లేకుండా చెప్పేసాడు అట..తనని అడగకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ని ఎంచుకోడానికి ఆయనతో సంప్రధింపులు జరిపినందుకు హీరో నాని కూడా ఆ దర్శక నిర్మాతలపై అసంతృప్తితో ఉన్నాడు అట..చిలికి చిలికి గాలివాన గా మారిన వీళ్లిద్దరి మధ్య వివాదం ఎప్పటికి సర్దుకుంటుందో చూడాలి..ఇది ఇలా ఉండగా నాని హీరోగా నటించిన అంటే సుందరానికి అనే సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని జూన్ 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇటీవలే విడుదల అయినా టీజర్ కి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..చాలా కాలం తర్వాత నాని నుండి వస్తున్నా కామెడీ ఎంటర్టైనర్ అవ్వడం తో ఈ మూవీ పై ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి..మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

    Recommended Videos:

    Tags