Prashant Neel: ప్రస్తుతం మన ఇండియా లో రాజమౌళి(SS Rajamouli) ఒక్కడే కాదు, ఎంతో మంది పాన్ ఇండియన్ డైరెక్టర్స్ ఉన్నారు. ప్రశాంత్ నీల్(Prashanth Neel), సందీప్ వంగ, లోకేష్ కనకరాజ్ ఇలా ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ గడిచిన నాలుగేళ్లలో పుట్టుకొచ్చారు. కానీ వీళ్లంతా పాన్ ఇండియా డైరెక్టర్స్ అవ్వడానికి ప్రధాన కారణం రాజమౌళి. ‘బాహుబలి’ చిత్రం తో ఆయన మన సౌత్ నుండి పాన్ ఇండియన్ సినిమా పవర్ ఎలా ఉంటుందో చూపించాడు. మన సత్తా ఏంటో, మనం ఎలాంటి సినిమాలు చేయగలమో అందరూ చూసారు కాబట్టే, ఒక్కో డైరెక్టర్ తమ ఆలోచనలకూ పదును చెప్తూ, ధైర్యం చేసి పాన్ ఇండియన్ సినిమాలు తీసి సక్సెస్ అవుతున్నారు. అలా సక్సెస్ అయిన వారిలో ఒకరు ప్రశాంత్ నీల్. ఆయన KGF చిత్రాన్ని తెలుగు లో రాజమౌళి కూడా ప్రమోట్ చేశాడు. KGF మూవీ రోలింగ్ టైటిల్స్ సమయం లో ప్రత్యేక కృతఙ్ఞతలు రాజమౌళి అని కూడా టైటిల్ పడుతుంది.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
ఇప్పుడు సోషల్ మీడియా లో రాజమౌళి గొప్పనా?, ప్రశాంత్ నీల్ గొప్పనా? అని పెద్ద ఎత్తున డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన #RRR, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘KGF చాప్టర్ 2’ చిత్రాలు రెండు ఒకే సమయం లో వచ్చాయి. వీటిల్లో KGF చాప్టర్ 2 కి #RRR కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అప్పట్లో అందరూ రాజమౌళి కంటే ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్ అంటూ కామెంట్స్ చేసేవారు. అయితే నేడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, రెండు భయాలను కలిపి ‘బాహుబలి : ది ఎపిక్’ గా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ ని అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రశాంత్ నీల్ రాజమౌళి గురించి మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘ఒక రోడ్డు కి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఆ పనిని ఒక కాంట్రాక్టర్ కి అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ రోడ్డు మరమత్తులు చేయమంటే ఏకంగా 16 లైన్ హై వే రోడ్ వేసాడు. ఆ 16 లైన్ హై వే నే పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ పేరు రాజమౌళి. ఈరోజు మేమంతా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాం అంటే అందుకు ముఖ్య కారణం రాజమౌళి’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ నీల్. రాజమౌళి కి పోటీలో ఉన్న డైరెక్టర్ ఇలా మాట్లాడడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.