Salaar Collection: కొద్దిగా తగ్గిన సలార్ మూవీ కలక్షన్స్…అసలేం జరుగుతుంది…

రీసెంట్ గా సలార్ సినిమాతో మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలక్షన్లు రాబడుతూ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది.

Written By: Gopi, Updated On : December 28, 2023 12:49 pm

Salaar

Follow us on

Salaar Collection: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తనదైన సత్తా చాటుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.ఆయన గతం లో చేసిన సా, రాధే శ్యామ్, ఆడి పురుషు సినిమాలు ప్లాప్ అయిన కూడా ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో ఆ సినిమాలు 200 కోట్ల కలక్షన్స్ ని రాబట్టాయి. ఇక దాంతో ప్రభాస్ క్రేజ్ ఏంటో అందరికీ అర్థం అయింది…

ఇక రీసెంట్ గా సలార్ సినిమాతో మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలక్షన్లు రాబడుతూ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా 600 కోట్లకు పైన కలక్షన్లను రాబట్టి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటుంది.ఇక వీకెండ్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ ఉండటం వల్ల కలక్షన్లు కొంతవరకు తగ్గినట్టుగా అనిపించినప్పటికీ సలార్ సినిమా మాత్రం ఈ వీకెండ్ లో మంచి కలక్షన్స్ ని రాబడు తుంది. ఈ సినిమా తప్పకుండా లాంగ్ రన్ లో 1000 కోట్ల వరకు కలక్షన్స్ ని ఈజీగా సాధిస్తుంది
అనేది మాత్రం ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవడం వల్ల ఈ సినిమా చూసిన ఆడియన్స్ మళ్ళీ రిపీటెడ్ గా ఈ సినిమాను చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఇదిలా ఉంటే సలార్ సినిమాతో 1000 కోట్ల మార్కు కనక దాటినట్టయితే ప్రశాంత్ నీల్ వరుసగా రెండు సినిమాలతో 1000 కోట్లు సాదించిన డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇక ఇప్పటికే ఈ మార్క్ ని బాహుబలి 2 సినిమాతో, ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సాధించగా ఇప్పుడు రాజమౌళి పక్కన ప్రశాంత్ నీల్ కూడా నిలుస్తాడు.

అందుకే ఇప్పుడు ఈ సినిమా 1000 కోట్ల కలక్షన్లు రాబట్టడం అనేది ప్రశాంత్ నీల్ కి చాలా కీలకంగా మారనుంది.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఇండియా వైడ్ గా ప్రతి ప్రొడ్యూసర్ కూడా క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కొంతమంది అయితే ప్రశాంత్ నీల్ కి అడ్వాన్సులు కూడా ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి…