Rajinikanth Wife Latha: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంపై ఆయన సతీమణి లత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆమె ఇటీవల ఓ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ .. ‘ కొచ్చడయాన్ ‘ వివాదం పై ఆమె మాట్లాడారు. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి అడుగు పెట్టకపోవడం తనను బాధించింది అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. ఆయనలో నిజమైన నాయకుడిని చూశాను. బలమైన కారణాల వల్లే ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టలేదు అని అన్నారు.
ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా .. ఆయనే కనుక రాజకీయాల్లో ఉండి ఉంటే సూపర్ పవర్ గా ఎదిగేవారు అని తెలిపారు. అంతే కాకుండా ‘ కొచ్చడియాన్ ‘ చీటింగ్ కేసు గురించి కూడా ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో ” సమాజంలో పేరు పొందిన వ్యక్తిని అవమానించేందుకు పెట్టిన కేసు ఇది. సెలెబ్రెటీలు గా ఉన్నందుకు మేము మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈ కేసు పెద్దది కాకపోవచ్చు కానీ దాని గురించి భారీగానే ప్రచారం జరిగింది.
నిజం చెప్పాలంటే ఇందులో ఎలాంటి మోసం జరగలేదు. పలు కథనాల్లో ప్రచురితమైనట్లు ఆ డబ్బుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అది పూర్తిగా మీడియా వ్యక్తులకు మధ్య జరిగిన వ్యవహారం. ఇప్పటికే వాళ్ళు ఈ సమస్యను సెటిల్ చేసుకున్నారు. ఈ విషయంలో నేను కేవలం హామీదారుగా మాత్రమే ఉన్న” అని ఆమె వెల్లడించారు.
రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో 3 డీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ‘ కొచ్చాడియాన్ ‘ తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్ పై ఇది నిర్మితమైంది. ఈ సినిమా నిర్మాణ పనులకు బెంగుళూరుకు చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన .. మురళి మనోహర్ ఋణం తీసుకున్నట్లు .. ఇందుకు లతా రజినీకాంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మురళి మనోహర్ .. తమకు డబ్బులు చెల్లించనందున యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొంత కాలం క్రితం కోర్టును ఆశ్రయించింది.