https://oktelugu.com/

Salaar 2: సలార్ 2 రిలీజ్ ఎప్పుడంటే..? మేటర్ లీక్ చేసిన ఆ నటుడు!

సలార్ 2 విడుదల కోసం ఫ్యాన్స్, మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సలార్ సిరీస్లో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే.

Written By: , Updated On : April 12, 2024 / 10:27 AM IST
Salaar 2 movie release date

Salaar 2 movie release date

Follow us on

Salaar 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. చాలా కాలం తర్వాత అభిమానులు మెచ్చే చిత్రం చేశాడు. ప్రభాస్ మాస్ లుక్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ రేపాయి. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ‘ సలార్ పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. వరల్డ్ వైడ్ సలార్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి భాగం భారీ హిట్ అవ్వడంతో, సలార్ పార్ట్ 2 పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. సలార్ 2కి సంబంధించిన ప్రతి న్యూస్ వైరల్ అవుతుంది.

సలార్ 2 విడుదల కోసం ఫ్యాన్స్, మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. సలార్ సిరీస్లో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వరద రాజమన్నార్ గా ఆయన కనిపించారు. ప్రభాస్ స్నేహితుడు పాత్రలో ఆయన మెప్పించాడు. సలార్ 1 క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసింది. ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులు గా మారడం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సలార్ పార్ట్ 2 లో చూడొచ్చు.

కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ 2కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆయన బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియా ‘ లో కీలక పాత్ర పోషించారు. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలార్ 2 గురించి మాట్లాడారు. ‘ సలార్ పార్ట్ 2 వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని పృథ్విరాజ్ అన్నారు.

కథ కూడా సిద్ధం అయిందని .. దర్శకుడు ప్రశాంత్ నీల్ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది అని పృథ్విరాజ్ అన్నారు. ‘సలార్ 2 లోని కొన్ని ఎపిసోడ్స్ చిత్రీకరణ పూర్తి చేసేందుకు నేను ఎంపూరన్ చిత్రం నుంచి బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. 2025 లో సలార్ 2 కచ్చితంగా విడుదల అవుతుంది అని నేను అనుకుంటున్నా ‘ అని పృథ్విరాజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు పృథ్విరాజ్.