https://oktelugu.com/

Sriranga Neethulu Review: శ్రీరంగ నీతులు మూవీ రివ్యూ…

"శ్రీరంగ నీతులు" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. విజయం సాధించిందా లేదా? అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Neelambaram
  • , Updated On : April 12, 2024 / 10:22 AM IST

    Sriranga Neethulu Review

    Follow us on

    Sriranga Neethulu Review: ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం దారుణమైన ఫ్లాపులుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఈ వారం పెద్ద సినిమాల హవా లేకపోవడంతో చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇక అందులో ముఖ్యంగా వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్న సుహాస్, బేబీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న విరాట్ అశ్విన్, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమా లో తన నటనతో మన కళ్ళల్లో నీళ్లు తెప్పించిన కార్తీక్ రత్నం, ఈ మధ్య మంచి కథలను ఎంచుకొని సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నా రుహాణి శర్మ కలిసి చేసిన “శ్రీరంగ నీతులు” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. విజయం సాధించిందా లేదా? అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్యాంసంగ్ శివ ( సుహస్ )అనే వ్యక్తి బస్తీ లో నివసిస్తూ ఉంటాడు. ఇక ఇతనికి ఫ్లెక్సీల పిచ్చి ఉంటుంది. తనకు ఇష్టమైన రాజకీయ నాయకులతో ఫోటోలు దిగి ఫ్లెక్సీల రూపంలో బస్తీ సెంటర్ లో పెట్టి అందరూ ఆ ఫ్లెక్సీ లను చూస్తుంటే వాళ్ళను చూసి తను సంతోషపడుతుంటాడు. అయితే తను ఒకరోజు నైట్ ఫ్లెక్సీ కట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఆ ఫ్లెక్సీ ఉండదు. తనకు ఆపోజిట్ గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను తొలగిస్తారు. ఇక ఈ సమయంలో శివ వాళ్ళ మీద రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు. ఆ ఫ్లెక్స్ ని మళ్ళీ తను కట్టుకున్నాడా లేదా అనేదే ఇక్కడ కీలకం… ఇక ఇదిలా ఉంటే కార్తీక్ (కార్తీక్ రత్నం) ది మరొక స్టోరీ. తను అనుకున్నదేది ఆయన సాధించలేకపోయాననే ఉద్దేశ్యం తో ఆయన మద్యానికి, గంజాయికి అలవాటు అవుతాడు. ఇక వాళ్ళ నాన్న అయిన దేవి ప్రసాద్ అతన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలో తన చిన్న కొడుకు అనుకోకుండా పోలీస్ కేసుల్లో చిక్కుకుంటాడు. మరి ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ కీలకంగా మారుతుంది… ఇక రుహాణి శర్మ , విరాట్ అశ్విన్ లది మరో స్టోరీ… వీళ్లిద్దరూ ప్రేమించుకుంటారు వీళ్ళ ప్రేమని ఇంట్లో చెప్పే ధైర్యం లేక సతమతమవుతూ ఉంటారు. అయితే వీళ్ళందరి కెరియర్ లో ఫైనల్ గా ఏం జరిగిందనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ప్రవీణ్ కుమార్ ఈ కథని రాసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనేది మాత్రం ఈ సినిమాలో చెప్పడానికి కొంత కన్ఫ్యూజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఒక నాలుగు స్టోరీలను కలుపుతూ ఒక సినిమా రావడం అనేది మనం ఇంతకుముందు చాలా సినిమాల్లో చూశాం. అయితే ఇలాంటి అన్ని స్టోరీలను ఎక్కడో ఒకచోట కలుపుతూ దానికి ఒక కన్ క్లూజన్ అనేది ఇవ్వాలి. అలా అయితే సినిమా చూసే ప్రేక్షకుడు కూడా కొంతవరకు హై ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఈ సినిమాలో ప్రవీణ్ కుమార్ అలాంటివి ఏమీ చేయలేదు. ప్రతి పాత్ర ఇండివిజువల్ గా ఉన్నప్పటికి వాటికి ఒక సంపూర్ణమైన క్లైమాక్స్ అయితే ఇవ్వలేకపోయాడు. అన్ని క్యారెక్టర్స్ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ని చూపించలేక అసంపూర్ణంగా ఈ సినిమాను పూర్తి చేశాడు. దీనివల్ల సినిమా చూసే సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా సగంలోనే అయిపోయిందా అనే అనుమానాలు కలిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా కథ కూడా రొటీన్ కథలానే ముందుకు తీసుకెళ్ళారు. ఇక ఈ స్టోరీ లో కాన్ఫ్లిక్ట్ ను సరిగ్గా అమర్చలేకపోవడం అనేది దర్శకుడు యొక్క ఫెయిల్యూర్ కి కారణమనే చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ లో కాన్ఫ్లిక్ట్ ని చాలా వైల్డ్ రేంజ్ లో క్రియేట్ చేసేదంతా స్పేస్ అయితే ఉంది.

    కానీ ఆ స్పేస్ ని వాడుకోకుండా తను ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ దాన్ని పర్ఫెక్ట్ గా పోట్రే చేయలేకపోయాడు. క్రిష్ తీసిన ‘వేదం ‘సినిమా కూడా ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్లతో తెరకెక్కిందే..అయినప్పటికీ వాటికి ఫైనల్ గా డెస్టినేషన్ పాయింట్ అనేది పెట్టాడు. కాబట్టి ఆ సినిమా ప్రేక్షకుడికి అర్థమైంది వాళ్లు దాన్ని ఓన్ చేసుకోగలిగారు. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. సినిమా పేరు శ్రీరంగ నీతులు అని పెట్టారు. కానీ ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చేత మనకు ఏం నీతులు చెప్పించారో అర్థం కాదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మనం లోతుగా ఆలోచించి ఈ క్యారెక్టర్ ద్వారా ఈ నీతి మనకు తెలిసింది. అని మనకు మనం ఆ క్యారెక్టర్ ఈ నీతిని చెప్పింది అనుకొని చివరికి సాటిస్ఫై అవ్వడమే తప్ప దర్శకుడు దాన్ని క్లియర్ కట్ గా చెప్పలేకపోయాడు… ఇక ఈ సినిమా ఫస్ట్ అఫ్ లో క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంట్ తో కొన్ని సీన్లు ఎంగేజింగ్ గా అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా బోరింగ్ గా నడిచింది. కథకు తగ్గ కాన్ఫ్లిక్ట్ లేకపోవడమే సెకండాఫ్ సాగతీతకు కారణమైందని తెలుస్తుంది. రైటింగ్ మాత్రం అక్కడక్కడ హై మూమెంట్స్ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్లు సినిమాకి ప్లస్ అయ్యాయి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టులు పర్ఫామెన్స్ విషయానికొస్తే “కలర్ ఫొటో” సినిమాతో హీరోగా మారిన సుహాస్ వరుసగా హీరోగా మంచి సబ్జెక్టులను చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను అయితే సంపాదించుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమాలో ఆయన పోషించిన శివ పాత్రలో తను అద్భుతంగా నటించి మెప్పించాడు. అయినప్పటికీ ఆ క్యారెక్టర్ కు ఉన్న జస్టిఫికేషన్ మాత్రం దర్శకుడు సరిగ్గా రాసుకోకపోవడం వల్ల అది అటు ఇటు కాకుండా మిగిలిపోయింది. కానీ సుహాస్ స్క్రీన్ మీద కనిపించినంతసేపు తన యాక్టింగ్ తో మెస్పరైజ్ చేశాడు.. ఇక విరాట్ అశ్విన్, రుహణి శర్మ లవర్స్ గా మంచి అభినయాన్ని కనబరిచారు. ముఖ్యంగా ఈ జనరేషన్ లవర్స్ ఎలాగైతే ఉంటున్నారో వాళ్ళని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారనే చెప్పాలి…

    కార్తీక్ రత్నం కేరాఫ్ కంచరపాలెం సినిమా తర్వాత తన బెస్ట్ పర్ఫామెన్స్ ని ఈ సినిమాలో ఇచ్చాడనే చెప్పాలి. కానీ ఆయన క్యారెక్టర్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది ఎలివేట్ అవ్వలేదు. దానివల్ల ఆయన ఎంత చేసినా అది గాల్లో మేడలు కట్టినట్టే ఉంది. తప్ప ఒరిజినల్ ఫీల్ అయితే రాలేదు… ఇక దేవి ప్రసాద్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ పాటల పరంగా పక్కన పెడితే కొన్ని కోర్ ఎమోషన్స్ సీన్స్ లో మాత్రం ఆయన ఇచ్చిన బీజియం కొంతవరకు హైలైట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా సుహాస్ ఎపిసోడ్స్ కి ఆయన బిజిఎం పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న సోల్ మిస్ అవ్వకుండా బిజియం కూడా 100% యూస్ అయిందనే చెప్పాలి… ఇక సినిమాటోగ్రాఫర్ “టీజో టామీ” అందించిన విజువల్స్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ లైటింగ్స్ పరంగా మాత్రం ఆయన ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడికి కన్వే అయ్యేలా చూపించాలి అంటే దానికి లైటింగ్ చాలా ఇంపార్టెంట్..ముఖ్యంగా డార్క్ లైట్ లో ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్ పడే బాధని ప్రేక్షకుడు రిసీవ్ చేసుకుంటాడు. హై లైటింగ్ లో ఉండి క్యారెక్టర్ ఎంత ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేయాలన్నా కూడా అది కృత్రిమంగానే అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ లో ఇలాంటి తప్పులు అయితే జరిగాయి. వాటిని సరిగ్గా చూసుకుంటే బాగుండేది…

    ఇక ఎడిటర్ శశాంక్ విప్పుతూరి సీన్ లో ఉన్న సోల్ ను కరెక్ట్ గా అర్థం చేసుకొని కరెక్ట్ గా మీటర్ వేసి కొలిచినట్టుగా ఎడిట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని సీన్లు లాగైనప్పటికీ దర్శకుడు యొక్క సలహాల మేరకు ఆ సీన్ లని అలాగే ఉంచినట్టుగా తెలుస్తుంది. కానీ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు మాత్రం చాలా షార్ప్ ఎడ్జ్ లో కట్ చేశాడు. దానికోసం అతన్ని మనం మెచ్చుకోవచ్చు… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సో సో గానే ఉన్నాయి…

    ప్లస్ పాయింట్స్

    సుహాస్, కార్తీక్ రత్నం,విరాట్ అశ్విన్, రుహణి శర్మల యాక్టింగ్…
    కొన్ని సీన్లలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్…
    సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ సీన్స్…

    మైనస్ పాయింట్స్

    కథలు కాన్ఫ్లిక్ట్ లేకపోవడం…
    క్యారెక్టర్ల ఫైనల్ గోల్ ఏంటో చెప్పకుండానే సినిమాని ముగించేయడం…
    స్క్రీన్ ప్లే
    కొన్నిచోట్ల దర్శకత్వం

    రేటింగ్
    ఇక ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 2/5

    చివరి లైన్
    శ్రీరంగనీతులు సినిమాలో నీతులు మిస్ అయ్యాయి…