Prabhas: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందనే విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… ఇక రీసెంట్ గా ‘రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఒక భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఇక మీదట చేయబోయే సినిమాలను ఆచితూచి చెయ్యాలనే ఆలోచనతో ఉన్నాడట. ఇక ఏదేమైనా కూడా ఆయన నుంచి రాబోతున్న ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త కంటెంట్ ఉండే విధంగా చూసుకుంటున్నాడు…ఇక మారుతి ఇచ్చిన షాక్ తో అతను కొంతమంది డైరెక్టర్లు చెప్పిన కథలను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది… కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయిన ప్రభాస్ ప్రస్తుతం ఆ సినిమాను క్యాన్సల్ చేశాడు. అలాగే తమిళ్ డైరెక్టర్లు ఇద్దరు చెప్పిన కథలను సైతం పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగులో అనిల్ రావిపూడి సైతం గతంలో ప్రభాస్ కి ఒక కథనైతే వినిపించాడట.
అప్పుడు ప్రభాస్ దాన్ని హోల్డ్ లో పెట్టాడట. కానీ ఇప్పుడు ఆ కథకి నో చెప్పినట్టుగా తెలుస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని వాళ్లతో సినిమాలు చేస్తేనే తనకి సూపర్ సక్సెసులు దక్కుతాయనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నాడు.
ఇంతకు ముందులాగా మొహమాటానికి పోయి సినిమాలను చేసి డిజాస్టర్లు మూట గట్టుకోవాల్సిన పరిస్థితి తనకు లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఏదైనా తను ఓపెన్ గా చెప్పేస్తూ సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితే నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటాడనే ఉద్దేశ్యంతో ప్రభాస్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక కథ నచ్చితే నచ్చింది అని నచ్చకపోతే నచ్చలేదని కరాకండిగా చెప్పేస్తున్నాడట…
ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్లందరితో అతను సినిమాలు చేయడం కుదరదు కాబట్టి మంచి కథలు ఉండి టాలెంట్ ఉన్న దర్శకులతో మాత్రమే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది…