Prabhas RajaSaab Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి నటుడు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఇప్పటివరకు ఏ హీరోకి లేనటువంటి ఒక స్టార్ డమ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనియంశంగా మారింది.ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో చేసిన రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ కథనాలైతే వెలువడుతున్నాయి. అయితే రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయినప్పటికి అందులో 100 కోట్లు ప్రభాస్ తీసుకోవడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ప్రభాస్ మంచి విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ విజయాలను నమోదు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
Also Read: వార్ 2 లో చేసిన తప్పు మళ్ళీ చేయను.. ఎన్టీఆర్ మనసు మారడానికి కారణమేంటి..?
ఇక ఇప్పటికే సలార్, కల్కి రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇప్పుడు రాజాసాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మారుతి పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు లేకపోతే మాత్రం చాలా వరకు డీలాపడిపోయే అవకాశాలు ఉన్నాయి. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా అతనికి ఎలాంటి సక్సెస్ ని కట్టబెడుతుంది తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ తో వాళ్ళకి బుద్ధి చెప్పాలని చూస్తున్నాడా..?
ఇక సంవత్సరానికి రెండు సినిమాలు చేసే మారుతి గత మూడు సంవత్సరాల నుంచి ఒక సినిమాను కూడా రిలీజ్ చేయకుండా కేవలం రాజాసాబ్ సినిమా మీద మాత్రమే ఫోకస్ చేసి ఈ సినిమా కోసమే రాత్రి పగలు కష్టపడుతున్నాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…