Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ లాంటి నటుడు పాన్ ఇండియాలో భారీ విజయాలను అందుకుంటూ నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఫౌజీ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆయన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ సినిమా చేయడానికి డేట్స్ అయితే ఇచ్చేశాడు. ఒక సంవత్సర కాలం పాటు ఆ సినిమా మీదనే తన పూర్తి డేట్స్ ని కేటాయించిన ఆయన ఆ తర్వాత చేయబోతున్న సినిమాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే స్పిరిట్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని సందీప్ రెడ్డివంగా చాలా కసితో ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఆయనను బాలీవుడ్ వాళ్లు చాలా వరకు తక్కువ చేసి మాట్లాడారు. అలాగే అతని సినిమాల గురించి కాంట్రవర్సీ చేసే ప్రయత్నాలైతే చేశారు. వాళ్ళందరికి స్పిరిట్ సినిమాతో సమాధానం చెప్పాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో తను సినిమా చేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీతో చూపిస్తారట.
Also Read: రాజమౌళి దెబ్బకి మరోసారి టికెట్ రేట్లు పెరగబోతున్నాయా..?
అందుకోసమే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? అని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత తొందరగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు…
యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డివంగా కూడా ఒకరు కావడం విశేషం…ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం…అర్జున్ రెడ్డి సినిమా యూత్ లో ఎంతటి పాపులారిటిని సంపాదించుకుందో మనందరికి తెలిసిందే…
Also Read: మెగా ఫ్యామిలీ కి హిట్ వచ్చి రెండేళ్లు దాటిందా..? చివరి హిట్ ఎప్పుడంటే.?
ఒక్క సినిమాతోనే ఆయన ఇండియాలో చాలా ఫేమస్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక అనిమల్ సినిమాతో ఇండియాలో ఎవరికి లేనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకొని స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎలివేట్ చేసుకున్నాడు…ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా నెక్స్ట్ లెవల్లో ఉండేలా చూసుకుంటున్నాడు…