Srisailam Forest Attack: ఏపీలో( Andhra Pradesh) మరో టిడిపి ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ ముగ్గురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై హై కమాండ్ ప్రత్యేక దృష్టి పెట్టింది. విచారణకు కూడా ఆదేశాలిచ్చింది. అయితే తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అదే జాబితాలో చేరారు. శ్రీశైలం అడవుల్లో అర్ధరాత్రి ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీరియస్ అయ్యారు. అయితే ఒక వైపు క్రమశిక్షణ పాటించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తున్నారు చంద్రబాబు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలపై వివాదాలు పెరుగుతూనే ఉన్నాయి.
Also Read: కాంగ్రెస్ వెనుక విదేశీ శక్తులు.. పవన్ బిగ్ బాంబ్
శ్రీశైలం అడవుల్లో ఘటన..
శ్రీశైలం అడవుల్లో అటవీ అధికారులు, సిబ్బందిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి( Buddha Rajshekar Reddy ) తో పాటు అనుచరులు దాడి చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. దాడి చేయడమే కాదు రాత్రి రెండు గంటలపాటు అడవిలో తిప్పారని అటవీ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారని.. వాహనాల్లో తమ సిబ్బందిని బంధించి.. కొట్టుకుంటూ రాత్రంతా రెండు గంటల పాటు శ్రీశైలం అడవుల్లో తిప్పారని తెలిపారు. ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో బంధించి దాడి చేశారని చెప్పుకొచ్చారు. తమ వద్ద ఉన్న వాకి టాకీలు, మొబైల్స్ తీసుకున్నారని మీడియాకు వెల్లడించారు. వాటికి సంబంధించి సిసి ఫుటేజ్, వీడియోలు కూడా అధికారులు విడుదల చేశారు. ఈ ఘటన వైరల్ అయింది.
ఆరా తీసిన చంద్రబాబు
మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) స్పందించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై సీరియస్ అయ్యారు. అసలు వివాదం ఏంటి అని ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్ తుఫాన్..ప్రకంపనలు రేపుతున్న రజినీకాంత్ ట్వీట్!
నివేదిక ఇవ్వాలని ఆదేశం..
మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) సైతం స్పందించారు. ఎమ్మెల్యే తో పాటు ఆయన అనుచరుల ప్రమేయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడే ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించ భూమిని తెలిపారు. సీఎం చంద్రబాబు తో పాటు తాను కూడా తప్పు చేస్తే బాధ్యులు చేస్తామని శాసనసభలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా జీవితంలో ఉన్నవారు తమను తాము నియంత్రించుకోవాలని.. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించే వారిని చంద్రబాబు నేతృత్వంలోని ఓటమి ప్రభుత్వం ఉపేక్షించ బోదని కూడా హెచ్చరించారు. అయితే ఈ ఘటన విషయంలో ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే పై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.