Prabhas- Kriti Sanon: ప్రభాస్ పాన్ ఇండియా హీరో మాత్రమే కాదు, ఇంటర్ నేషనల్ హీరో కూడా. అందుకే, ప్రభాస్ పేరు చెబితే.. ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు. అభిమానంతో అభిమానులు నీరాజనాలు పలుకుతారు. అసలు ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ జనాలు కూడా ప్రభాస్ అంటే పడి చస్తున్నారు.

జనరల్ గా ఇలాంటి హీరోతో పని చేయాలని ఏ హీరోయిన్ అయినా కలలు కంటుంది. పైగా ప్రభాస్ పక్కా జెంటిల్ మ్యాన్. సరదాగా ఉంటూ సెట్లో అందరితో కలిసి పోతాడు. నేను గొప్ప స్టార్ హీరోని అనే ఫీలింగ్ ప్రభాస్ లో కనిపించదు. అందుకే, ఇప్పుడు ఒక హీరోయిన్ ప్రభాస్ అంటే పడి చస్తోందట. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఏమిటి ఆమె కథ అనేది తెలుసుకుందాం రండి.
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కృతి సనన్ నటిస్తోంది. షూటింగ్ లో ఏర్పడిన బంధంతో ప్రభాస్, కృతి సనన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని బాలీవుడ్ సర్కిల్ లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో కూడా ఉన్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. నిన్న కూడా నేరుగా ప్రభాస్ ఇంటికి వచ్చిందట. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉంది అని తెలియదు గాని, ఈ పుకార్ల పై మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నెటిజన్లు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు. అందుకే, ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి రెట్టింపు అయింది. పైగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా “ఏ- ఆది పురుష్” సినిమా రాబోతుంది. దీనికితోడు బాలీవుడ్ బడా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

అన్నట్టు ఈ ఆదిపురుష్ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను యూవీ క్రియేషన్స్ రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. గ్రాఫిక్స్ కి అత్యంత ప్రాధాన్యత వున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది.
కాగా లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమాలో భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు లాంటివి లేకుండా మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులను జోడిస్తారట. దీనివల్ల సినిమా చూడడానికి బాగా ఆసక్తికరంగా వుంటుందని, పైగా చాలా సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు మేకర్స్.
[…] Also Read: Prabhas- Kriti Sanon: కృష్ణంరాజు చివరి కోరిక తీర్చ… […]