Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ తన ఆన్సర్ తో నెటిజెన్ దిమ్మ తిరిగింది. ఆమె అలా స్పందిస్తుందని బహుశా మనోడు ఊహించి ఉండడు. తెలుగు రాష్ట్రాల్లో రష్మీ అంటే తెలియనివారు లేరు. నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ బ్రేక్ రాకపోవడంతో యాంకరింగ్ వైపు వచ్చింది. అప్పుడే జనాల్లోకి వెళుతున్న కామెడీ షో జబర్దస్త్ యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోవడంతో రష్మీకి ఛాన్స్ వచ్చింది. ఈ లెజెండరీ కామెడీ షో ఆమె ఫేట్ మార్చేసింది. జబర్దస్త్ బ్లాక్ బస్టర్ సక్సెస్ నేపథ్యంలో… ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అప్పుడు మరలా అనసూయ రీ ఎంట్రీ ఇచ్చారు.

రష్మీ, అనసూయలకు నేమ్, ఫేమ్ జబర్దస్త్ తో దక్కాయి. హీరోయిన్ కావాలన్న రష్మీ ఆశలు జబర్దస్త్ నెరవేర్చింది. గ్లామరస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ దక్కాయి. అరడజనుకు పైగా చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించారు. పొట్టి బట్టల్లో బుల్లితెరను హీటు పుట్టించే రష్మీ, అనసూయలు తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. వీరికి నెగిటివ్ కామెంట్స్, సెటైర్స్ ఎదురవుతుంటాయి. నెటిజెన్స్ కామెంట్స్ కి వీరిద్దరూ తమదైన శైలిలో సమాధానం చెబుతుంటారు.
తాజాగా ఓ నెటిజన్… ”ఈ చిల్లర షోలు ఎన్నాళ్ళు చేస్తారు మేడం చక్కగా హీరోయిన్ గా సినిమాలు చేసుకోండి” అని కామెంట్ పెట్టాడు. సదరు కామెంట్ కి స్పందించిన రష్మీ… ”నా దగ్గర మంచి కథలు కూడా ఉన్నాయి. నీ దగ్గర డబ్బులుండి, నిర్మాతగా తెరకెక్కిస్తానంటే చెప్పు వచ్చేస్తాను…” అని రిప్లై ఇచ్చారు. నువ్వు ప్రొడ్యూసర్ గా మారితే సినిమాలు చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదని సూటిగా సమాధానం చెప్పింది. హీరోయిన్ గా నటించడం రష్మీకి ఇష్టం లేనట్లు, ఆమె కావాలనే సినిమాలు వదిలేసి టెలివిజన్ షోలు చేసుకుంటున్నట్లు, ఆ నెటిజెన్ కామెంట్ పెట్టడంతో రష్మీ ఆ విధంగా చురకలు అంటించారు.

ఒక దశలో విరివిగా రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. అలాగే ఓ సినిమా విషయంలో నిర్మాతను ఇబ్బంది పెట్టినట్లు సమాచారం ఉంది. కారణం ఏదైనా రష్మీకి సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి. విజయాలు దక్కితే ఆమె కెరీర్ మరోలా ఉండేది. అయినా నిరాశ పడకుండా రష్మీ… బుల్లితెర అవకాశాలతో సంతృప్తి చెందుతుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా రష్మీ కొనసాగుతున్నారు.
[…] Also Read: Anchor Rashmi Gautam: నీ దగ్గర డబ్బు ఉందా…? ఉందంటే చ… […]