https://oktelugu.com/

మరోసారి ప్రభాస్ ను ఢీకొట్టనున్న రానా..!

దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ ఎన్నో రికార్డులను తిరిగరాసింది. టాలీవుడ్ రికార్డులే కాకుండా ఇండియన్ రికార్డులు సైతం ‘బాహుబలి’ సృష్టించిన సునామీలో కొట్టుకుపోయాయి. ఈ మూవీ తర్వాత ‘బాహుబలి’ రికార్డులు, నాన్ బాహుబలి రికార్డులు అనే కొత్త ట్రెండ్ మొదలైంది. కాగా మరోసారి ‘బాహుబలి’ యోధులు కలిసి నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అమరేంద్ర బహుబలి(ప్రభాస్), భల్లాళదేవుడు(రానా)లు ఓ చిత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది. ‘బాహుబలి’లో పోటాపోటీగా నటించిన ప్రభాస్-రానా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 17, 2020 / 06:21 PM IST
    Follow us on


    దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ ఎన్నో రికార్డులను తిరిగరాసింది. టాలీవుడ్ రికార్డులే కాకుండా ఇండియన్ రికార్డులు సైతం ‘బాహుబలి’ సృష్టించిన సునామీలో కొట్టుకుపోయాయి. ఈ మూవీ తర్వాత ‘బాహుబలి’ రికార్డులు, నాన్ బాహుబలి రికార్డులు అనే కొత్త ట్రెండ్ మొదలైంది. కాగా మరోసారి ‘బాహుబలి’ యోధులు కలిసి నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అమరేంద్ర బహుబలి(ప్రభాస్), భల్లాళదేవుడు(రానా)లు ఓ చిత్రం నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.

    ‘బాహుబలి’లో పోటాపోటీగా నటించిన ప్రభాస్-రానా మరోసారి కలిసి నటించేందుకు సిద్ధపడుతున్నాడు. ఇటీవల డార్లింగ్ ప్రభాస్ వైజయంతీ బ్యానర్లో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీకి సంబంధించిన ప్రకటన కూడా చేశాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ కు విలన్ గా రానా అయితే బాగుంటుదని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. తొలుత ఈ క్యారెక్టర్లో అరవింద్ స్వామిని తీసుకోవాలని భావించారు. అయితే ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా రానాను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సైంటీఫిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ కథను నాగ్ అశ్విన్ రానాకు విన్పించగా వెంటనే ఒకే చేశాడట. దాదాపు 300కోట్ల రూపాయాల భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించేందుకు వైజయంతీ మూవీస్ ప్లాన్ చేస్తోంది.

    ప్రస్తుతం ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవల యూరప్ లో ఈ మూవీకి సంబంధించిన యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించారు. లాక్డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. లాక్డౌన్ ఎత్తివేయగానే దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని తిరిగి ప్రారంభించనున్నాడు. ఈ మూవీ కాంప్లీట్ కాగానే ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించే మూవీలో నటించనున్నాడు. కాగా రానా ప్రస్తుతం ‘అరణ్య’ అనే మూవీలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను ముందుకు రానుంది. ప్రభాస్-రానా కాంబినేషన్లో మరోసారి రిపీట్ కానుండటంతో అభిమానులు ఖుషీ అవుతోన్నాయి. త్వరలోనే దీనిపై దర్శక, నిర్మాతలు అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధపడుతోన్నారు.