Prabhas Raja Saab Movie: ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. సలార్(Salaar), కల్కి (Kalki)లాంటి సినిమాలతో తనకు ఎవరు పోటీ లేరు, రారు అనేంతలా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ మారుతి (Maruthi) డైరెక్షన్లో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా విషయంలో మాత్రం చాలా వరకు పెద్ద తప్పు చేశాడు అంటూ కొన్ని కామెంట్లు అయితే వస్తున్నాయి. ఆయన ఆల్మోస్ట్ 2000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన హీరో…అలాంటి ఒక హీరో రాజాసాబ్ (Rajasaab) పెద్దగా కథలేని సినిమాలో నటించడం అనేది అతని అభిమానులను కొంతవరకు ఇబ్బంది పెడుతోంది. నిజానికి ఒకసారి వచ్చిన ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఒక సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత దానికి మించిన సినిమాలు చేయాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం సలార్(Salaar), కల్కి (Kalki) లాంటి సినిమాల తర్వాత ఈ సినిమా ఎందుకు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇలాంటి ఒక రొటీన్ రొట్ట కమర్షియల్ సినిమాలు చేయడం వల్ల ఆయన ఇమేజ్ పడిపోతోంది. అలా కాకుండా మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. మరి ప్రభాస్ లాంటి స్టార్ హీరో అభిమానుల్లో ఆనందాన్ని నింపడానికే ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాను చేస్తున్నాను అంటూ గతంలో చాలా సందర్భాల్లో తెలియజేశాడు. అయినప్పటికి మారుతి లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో సినిమా చేసే కంటే వేరే కమర్షియల్ డైరెక్టర్ తో సినిమా చేసి ఉంటే బాగుండేది.
ఈ మూవీ టీజర్ ని కనుక మనం చూసినట్లయితే అందులో మనకు మరిహి ఇంతకు ముందు చేసిన ‘ప్రేమ కథ చిత్రమ్’ లోని కొన్ని అంశాలను ‘చంద్రముఖి’ (Chandramukhi) సినిమాలోని కొన్ని సీన్లను తీసి మరి ఈ కథని రాసినట్టుగా తెలుస్తోంది. అందుకని ప్రభాస్ ఈ సినిమా విషయంలో తప్పు చేశాడు.
Also Read: Prabhas : ప్రభాస్ తో ఆ సినిమా చేస్తే బాగా వర్కౌట్ అవుతుందా..?
తనకు ఎవరూ సజెషన్స్ ఇవ్వలేదా? లేదంటే భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాం కాబట్టి చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు తనని మరింత ఆదరిస్తారు అని అనుకున్నాడా? ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ పెద్ద తప్పు చేశాడు.
ఈ విషయాన్ని లేటుగా తెలుసుకున్న ప్రభాస్ ప్రస్తుతం రియాలైజ్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…