Prabhas Raja Saab : మిర్చి తర్వాత ప్రభాస్(Rebel Star Prabhas) నుండి అలాంటి మాస్ కమర్షియల్ సినిమాని ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. ముఖ్యంగా అభిమానులు మళ్లీ ఇలాంటి వింటేజ్ ప్రభాస్ ని చూస్తామా లేదా అని అనుకోని రోజు ఉండదు. ఎందుకంటే ప్రభాస్ కి వాళ్ళు అభిమానులు అయ్యిందే ఇలాంటి మాస్ కమర్షియల్ సినిమాలను చూసి. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్ కి ఎగబాకడం తో, ప్రతీ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో చేస్తూ వచ్చాడు. ఫలితంగా లోకల్ మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త దూరం అయ్యాడు. అలాంటి ఆడియన్స్ కోసం ఇప్పుడు ఆయన ‘రాజా సాబ్'(Raja Saab Movie) తో మన ముందుకు రాబోతున్నాడు. ఇందులో ప్రభాస్ వింటేజ్ కామెడీ టైమింగ్ తో పాటు, వింటేజ్ మాస్, వింటేజ్ డ్యాన్స్ కూడా చూడొచ్చు. కేవలం పాటల చిత్రీకరణ తప్ప, సినిమా షూటింగ్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది.
ప్రస్తుతం ప్రభాస్ మరియు హీరోయిన్ నిధి అగర్వాల్ పై ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కొన్ని రీసెంట్ గానే సోషల్ మీడియా లో లీక్ అవ్వడం మనం చూశాము. నేడు ఈ పాటకు సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ వీడియో లో ప్రభాస్ డ్యాన్స్ వేయడాన్ని మనం గమనించవచ్చు. ప్రభాస్ డ్యాన్స్ వేయడం ఆడియన్స్ కళ్లారా చూసి పదేళ్లు దాటిపోయింది. మిర్చి లోనే ఆయన చివరిసారిగా డ్యాన్స్ వేయడం మనమంతా చూడడం. ఆ తర్వాత బాహుబలి లో గ్రాండియర్ సాంగ్స్ ఉన్నాయి కానీ, అందులో ప్రభాస్ డ్యాన్స్ వేయడానికి ఎలాంటి స్కోప్ లేదు. మిర్చి తర్వాత నేరుగా ఈ ‘రాజాసాబ్’ లోనే మనం ప్రభాస్ డ్యాన్స్ చూడబోతున్నాము. వింటేజ్ ప్రభాస్ ని మరోసారి బయటకి తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతీ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ చిత్రాన్ని మొదట్లో డిసెంబర్ 5న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ బయ్యర్స్ సంక్రాంతికి వస్తే బాగుంటుందని సూచించడంతో జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు రీసెంట్ గానే ఒక ట్రైలర్ కట్ ని విడుదల చేసి అధికారికంగా తెలిపారు. అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగింది. ఆ బిజినెస్ మొత్తం రీ కవర్ అవ్వాలంటే ఈ చిత్రానికి సోలో రిలీజ్ ఎంతైనా అవసరం ఉంది. సంక్రాంతికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో థియేటర్స్ ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అందుకే కాస్త సోలో రిలీజ్ కోసం జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
#Prabhas Anna Steps
pic.twitter.com/pZqNVAYYaz— Vicky (@imVicky____) October 20, 2025