https://oktelugu.com/

Radhe Shyam Trailer Records: బన్నీ, పవన్, ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన ప్రభాస్ !

Radhe Shyam Trailer Records: అదనపు హంగులతో భారీ అంచనాలతో వచ్చిన ‘పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్’ ట్రైలర్ 2 కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. ‘మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడుతుంటాం.. కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయ్’ అంటూ ప్రభాస్ ఈ రెండో ట్రైలర్ తో సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ 2 యూట్యూబ్ లో రికార్డ్ వ్యూవ్స్ అందుకుంటూ లక్షల లైక్స్ ను సాధిస్తుంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : March 2, 2022 / 06:32 PM IST
    Follow us on

    Radhe Shyam Trailer Records: అదనపు హంగులతో భారీ అంచనాలతో వచ్చిన ‘పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్’ ట్రైలర్ 2 కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. ‘మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడుతుంటాం.. కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయ్’ అంటూ ప్రభాస్ ఈ రెండో ట్రైలర్ తో సినిమా పై అంచనాలను రెట్టింపు చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ 2 యూట్యూబ్ లో రికార్డ్ వ్యూవ్స్ అందుకుంటూ లక్షల లైక్స్ ను సాధిస్తుంది.

    Radhe Shyam Trailer Records

    పైగా పాత సినిమాల ట్రైలర్ రికార్డులను కూడా రాధేశ్యామ్’ చాలా వేగంగా బ్రేక్ చేస్తుండడం విశేషం. మొదటి నుంచి ఈ సినిమాకు అద్భుతమైన బజ్ ఉండటంతో.. యూట్యూబ్ కూడా షేక్ అయిపోతుంది. ఇప్పటివరకు అత్యధిక వేగంగా 300 K లైక్స్ అందుకున్న నెంబర్ వన్ టాలీవుడ్ ట్రైలర్ గా రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకుముందు పుష్ప సినిమా నాలుగు గంటల్లో 300 k లైక్స్ సాధించింది.

    పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ 3 గంటల 15 నిమిషాల్లో ఆ రికార్డ్ ను అందుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా 3 గంటల 02 నిమిషాల లో 300 k పైగా లైక్స్ ను సాధించింది. అయితే ఈ రికార్డు లన్నిటిని ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ బ్రేక్ చేస్తూ 2 గంటల 56 నిమిషాల్లోనే అత్యధిక వేగంగా 300 k లైక్స్ ను సాధించింది. ఇప్పుడు రాధేశ్యామ్ ట్రైలర్ 2 కేవలం 2 గంటల 51 నిమిషాల్లోనే శరవేగంగా 300 k పైగా లైక్స్ ను సాధించి కొత్త రికార్డ్ ను సెట్ చేసింది.

    Also Read: అమ్మాయిల‌ను త‌ప్పుగా తాకే విధంగా బిగ్ బాస్ టాస్క్‌.. తీవ్ర విమ‌ర్శ‌లు..!

    చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా అత్యధిక వేగంగా 100 కోట్ల వసూళ్లను అందుకునేలా ఉంది. ఇక ఈ చిత్రాన్ని హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది. కాబట్టి.. నిర్మాతలకు ఈ సినిమాతో భారీ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్‌ లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ లు చాలా బాగున్నాయి.

    పైగా ప్రభాస్ స్టైలిష్ లుక్.. పూజా హెగ్డే గ్లామర్ సినిమాకి బాగా ప్లస్ కానుంది. మొత్తమ్మీద అదిరిపోయే విజువల్స్ తో అద్భుతమైన షాట్స్ తో ఈ ట్రైలర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మరి కాలం రాసిన చందమామ కథలా సాగే ఈ ప్రేమకథ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తోందో చూడాలి.

    Also Read: నాయీ బ్రాహ్మణులతో పెట్టుకున్న మోహన్ బాబు.. ఈసారి ఏమవుతుందో ?

    Tags