https://oktelugu.com/

ఎలా దెబ్బకొట్టాలో.. కేసీఆర్ ఆదర్శం అంతే!

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును మూట ముల్లె సర్దుకొని హైదరాబాద్ నుంచి పారిపోయేలా చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ ది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు నెలవైన రాజకీయాల్లో ఆరితేరిన అపర బీష్ముడు మన చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబ సభ్యులతోనే లాక్కొని నేడు వారికి అందులో పాత్రలేకుండా చేసిన ఘనత బాబు సొంతం. 40 ఏళ్లుగా జగన్, వైఎస్ఆర్, కేసీఆర్ సహా ఎంతో మంది […]

Written By:
  • NARESH
  • , Updated On : August 4, 2020 / 01:14 PM IST
    Follow us on


    40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును మూట ముల్లె సర్దుకొని హైదరాబాద్ నుంచి పారిపోయేలా చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ ది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు నెలవైన రాజకీయాల్లో ఆరితేరిన అపర బీష్ముడు మన చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన కుటుంబ సభ్యులతోనే లాక్కొని నేడు వారికి అందులో పాత్రలేకుండా చేసిన ఘనత బాబు సొంతం. 40 ఏళ్లుగా జగన్, వైఎస్ఆర్, కేసీఆర్ సహా ఎంతో మంది చంద్రబాబు బాధితులే.. అస్సలు ఒక్క కోర్టుల్లో కూడా దొరకని చంద్రబాబు కేసీఆర్ కు దొరికి పరారయ్యాడు. కేసీఆర్ అపరచాణక్య తెలివితేటలకు చంద్రబాబు పలాయనం చిత్తగించారు. తొలిసారి వెనకడుగు వేశారు.

    Also Read: అమరావతి టీడీపీకి.. విశాఖ వైసీపీకి లాభం? పవన్ వస్తే.?

    ఓటుకు నోటు కేసులో ఇరికించేలా చేసి చంద్రబాబును అమరావతికి సాగనంపారు కేసీఆర్ . అంతకుముందు తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి విభజన వాదంతో తెలంగాణలో టీడీపీనే లేకుండా చేశారు.

    కేసీఆర్ వ్యూహాలు, దెబ్బలకు చంద్రబాబు కోలుకోలేదు. ఏకంగా తెలంగాణలో టీడీపీ దుకాణమే ఇప్పుడు ఖాళీ అయిపోయింది. నేతలంతా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో చేరిపోవడంతో తెలంగాణలో ఉనికే లేదు.

    ఇప్పుడు కేసీఆర్ దగ్గర సలహాలు సూచనలు తీసుకున్నాడో ఏమో కానీ ఏపీ సీఎం జగన్ అదే కేసీఆర్ మంత్రంతో చంద్రబాబును కొట్టారని అమరావతిలో టాక్ వినిపిస్తోంది. ‘విభజనవాదం’ ఇదీ కేసీఆర్ నినాదం.. ఆయన నినాదాన్ని అందిపుచ్చుకొని జగన్ ఇప్పుడు ఏపీకి మూడు రాజధానులు చేశాడు. చంద్రబాబు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అమరావతి ప్రాంతం కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమలో బాబు విలన్ అవుతున్నాడు. అలా బాబును ఒక ప్రాంతానికి పరిమితం చేసి రెండు ప్రాంతాల్లో వైసీపీ బలంగా తయారువుతోంది. ఇలా కేసీఆర్ స్ట్రాటజీతోనే చంద్రబాబును చావుదెబ్బ తీసే ప్లాన్ జగన్ తెస్తున్నారు.

    Also Read: కేసీఆర్ కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

    ఇప్పుడు చంద్రబాబు విశాఖ రాజధానికి, ఉత్తరాంధ్రకు వ్యతిరేకమంటూ జగన్-వైసీపీ కొత్త పల్లవిని ఎత్తుకుంటున్నారట.. ఇలా కేసీఆర్ ఐడియాలజీనే ఏపీలో చంద్రబాబుపై ప్రయోగిస్తూ జగన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడని వైసీపీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. సమకాలీన రాజకీయాల్లో విభజన వాదం కంటే బలమైన ఆయుధం మరొకటి లేదని.. కేేసీఆర్ అందుకే దాన్ని ప్రతీసారి అవసరార్థం వాడేస్తుంటారని విశ్లేషకులు చెబుతున్నారు.

    -ఎన్నం