https://oktelugu.com/

Radhe Shyam Movie: అనుకున్నట్టే అయిన “రాధే శ్యామ్” రిలీజ్… నిరాశలో అభిమానులు ?

Radhe Shyam Movie: దేశంలో ఓమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్య్ఫ్యూ.. నిబంధనలు అమలవుతున్నాయి. అలాగే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో విడుదలకు సర్వం సిద్ధం చేసుకుని రెడీగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన సంగతి తెలసిందే. తాజాగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమాను సైతం వాయిదా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 12:03 PM IST
    Follow us on

    Radhe Shyam Movie: దేశంలో ఓమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్య్ఫ్యూ.. నిబంధనలు అమలవుతున్నాయి. అలాగే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో విడుదలకు సర్వం సిద్ధం చేసుకుని రెడీగా ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలు వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన సంగతి తెలసిందే. తాజాగా ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమాను సైతం వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా… దాదాపు 10 భాషల్లో సినిమా రిలీజ్ కి ప్లాన్ చేశారు.

    కాగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మేకర్స్. త్వరలోనే సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో రాధేశ్యామ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తోంది.

    వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ విక్రమాధిత్య పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇక ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.ఇప్పుడు రాధే శ్యామ్ కూడా వాయిదా వేయడంతో టాలీవుడ్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.