https://oktelugu.com/

Katrina Kaif: హీరోయిన్ కొత్త కాపురం లోని మధురానుభూతులు వైరల్ !

Katrina Kaif: కత్రినా కైఫ్ ప్రస్తుతం ఇల్లాలిగా బాగా ఎంజాయ్ చేస్తోంది. “హోమ్ స్వీట్ హోమ్” అంటూ అబ్బో కొత్త కొత్తగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలోకి వదులుతుంది. మొత్తమ్మీద హీరో విక్కి కౌశల్ ని పెళ్లాడి, అతని ఇంట్లోకి అడుగుపెట్టి.. కొత్త కాపురంలోని మధురానుభూతులను చక్కగా ఆస్వాదిస్తోంది. మరి ఆ స్థాయి అనుభూతి చెందుతున్నప్పుడు.. ఆ ఆనందాలను పంచుకోకపోతే ఎలా ? అందుకే, తాను ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి కొత్త ఇంట్లో […]

Written By:
  • Shiva
  • , Updated On : January 5, 2022 / 12:00 PM IST
    Follow us on

    Katrina Kaif: కత్రినా కైఫ్ ప్రస్తుతం ఇల్లాలిగా బాగా ఎంజాయ్ చేస్తోంది. “హోమ్ స్వీట్ హోమ్” అంటూ అబ్బో కొత్త కొత్తగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలోకి వదులుతుంది. మొత్తమ్మీద హీరో విక్కి కౌశల్ ని పెళ్లాడి, అతని ఇంట్లోకి అడుగుపెట్టి.. కొత్త కాపురంలోని మధురానుభూతులను చక్కగా ఆస్వాదిస్తోంది. మరి ఆ స్థాయి అనుభూతి చెందుతున్నప్పుడు.. ఆ ఆనందాలను పంచుకోకపోతే ఎలా ?

    Katrina Kaif

    అందుకే, తాను ప్రస్తుతం ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి కొత్త ఇంట్లో నుంచి లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం పోస్ట్ చేసింది. అయితే, అందులో ఒక ఫోటో మాత్రం తెగ ఆకట్టుకుంది. చిన్న షార్ట్ ధరించి, పైన స్వేట్టర్ వేసుకుని.. అలా వయ్యారంగా సోఫాలో కూర్చుని చిరుమందహాసం తో ఒక ఫోజు ఇచ్చింది. ఇలా దిగిన ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

    Also Read: దీప్తి సునయనపై విరుచుకపడ్డ శ్రీరెడ్డి.. నువ్వు తిరిగితే తప్పు లేదా.. అలా ఎలా బ్రేకప్ చెప్తావ్!

    అయితే, ఈ ఫోటోలు వైరల్ అవ్వడానికి మరో కారణం ఉంది. ఈ ఫోటోల్లో కత్రినా మంగళసూత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి హీరోయిన్ మొదటసారి మంగళ సూత్రంలో కనిపిస్తే.. హైలెట్ కాకుండా ఎలా ఉంటుంది. ఏది ఏమైనా 39 ఏళ్ల వయసులో కత్రినా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక సినిమాలకు కూడా గుడ్ బై చెప్పాలనే ఆలోచనల్లో ఉంది.

    కత్రినా జంట కొత్త కాపురం ముంబైలోని ఒక లగ్జరీ అపార్ట్ మెంట్ లో పెట్టింది. పైగా అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు వీరికి నైబర్స్ కూడా. అన్నట్టు రాజ‌స్థాన్ లోని సిక్స్‌సెన్సెస్ ఫోర్టులో కత్రినా- విక్కీల పెళ్లి ఘనం జరిగింది. 400 మంది సినీ – రాజకీయ ప్రముఖులు వీరి పెళ్ళికి హాజరయ్యారు. అందుకే, ఓ ఓటీటీ కంపెనీకి అక్ష‌రాలా వంద కోట్ల‌కు ఈ పెళ్లికి సంబంధించిన స‌మ‌స్త ఫుటేజీనీ కత్రినా జంట చక్కగా అమ్మేసుకుంది.

    Also Read: సీనియర్ న‌టి ‘నగ్మా’కు పెళ్లికాకపోవడానికి ఆ హీరోలతో ఎఫైర్సే కారణమా..?

    Tags