Pooja Hegde: టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా విపరీతమైన క్రేజ్ తో చలామణి అవుతున్న ఏకైక హీరోయిన్ ‘పూజా హెగ్డే’నే. నిజానికి పూజా కంటే అందగత్తెలు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. పైగా యాక్టింగ్ పరంగా కూడా ‘పూజా హెగ్డే’ గొప్ప నటి ఏమి కాదు. అయినా ఈ బ్యూటీకి చాలా ఈజీగా స్టార్ డమ్ వచ్చింది.

ఆ స్టార్ డమ్ కి తగ్గట్టుగానే.. హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటుంది పూజా. తాజాగా బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రణ్ వీర్ సింగ్ సెట్ లో ఉంటే తనకు ఫుల్ ఎంటర్ టైన్‌మెంట్ ఉంటుందని.. రణ్ వీర్ ను ఎప్పుడూ కలిసిన తాను బాగా ఎంజాయ్ చేస్తాను అని పూజా చెప్పుకొచ్చింది.
Also Read: ‘విజయ్ దేవరకొండ’తో రొమాన్స్ కి 3 కోట్లు అడిగిన సమంత
పైగా ఓ షాకింగ్ విషయం కూడా చెప్పింది. రణ్ వీర్ సింగ్ ను తాను పమ్మీ ఆంటీ అని పిలుస్తానని పూజా చెప్పింది. ఇక రణ్ వీర్ సింగ్ తో కలిసి నటించిన సర్కస్ సినిమాలో తమ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుందని.. అందుకే మా జంట బాగా క్లిక్ అయ్యింది అని తెలిపింది పూజా. మొత్తానికి ‘పూజా హెగ్డే’ మొహమాటం లేకుండా ఉన్న విషయాలన్నీ వివరంగా వివరించింది.
ప్రస్తుతం ‘పూజా హెగ్డే’ చేతిలో భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే, తాజాగా చేసిన కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నలుగురిని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నోళ్లు కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి అని, ఏ కామెంట్స్ పడితే.. ఆ కామెంట్స్ చెయ్యొద్దు అని నెటిజన్లు మెసేజ్ లు చేస్తున్నారు.

అయినా హీరోయిన్లు డబ్బుల కోసం వెంపర్లాడకుండా ఎందుకు ఉంటారు. ఈ మధ్య కొందరు హీరోయిన్స్ క్రేజ్ కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పైగా డబ్బులు ఇస్తే చాలు ఏం చేయడానికైనా సిద్ధమని నిరూపిస్తున్నారు. పూజా హెగ్డే ఆ మధ్య ఓ ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. కొత్తగా మరో బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేసే ఆలోచనలో ఉంది.
Also Read: డాడీ’ గా మెగాస్టార్.. ‘బ్రో’ గా నాని.. కలయిక అదిరిపోయింది !