Kannappa (1)
Kannappa: మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని మంచు విష్ణు ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అందుకే తన మార్కెట్ పరిధిని దాటి, సుమారుగా 200 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాడు. అంతే కాకుండా ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohan lal), అక్షయ్ కుమార్(Akshay Kumar), శివరాజ్ కుమార్(Shiva Raj Kumar) లాంటి సూపర్ స్టార్స్ ని ఇందులో నటించేయడంలో సక్సెస్ అయ్యాడు. మోహన్ బాబు మీద ఉన్న అభిమానం, గౌరవం తో ప్రభాస్, మోహన్ లాల్ వంటి వారు ఈ చిత్రంలో నటిస్తున్నందుకు ఒక్క రూపాయిల రెమ్యూనరేషన్ కూడా అందుకోలేదు. అయితే అక్షయ్ కుమార్ ని ఈ చిత్రంలో శివుడి పాత్ర చేయాలని ముందుగా మంచు విష్ణు నే ఆయన వద్దకు వెళ్లి అడిగాడట. కానీ అక్షయ్ కుమార్ అందుకు ఒప్పుకోలేదట.
అయినప్పటికీ కూడా ఆయన్ని వదలకుండా మొండిపట్టు పట్టి రెండవసారి కూడా ఒప్పించే ప్రయత్నం చేశాడట, కానీ అక్షయ్ కుమార్ అప్పటికీ ఒప్పుకోలేదు. దీంతో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ కి ఎంతో ఇష్టమైన ఒక ప్రముఖ డైరెక్టర్ తో ఫోన్ చేయించి అడిగించారట. ఆయన మీద ఉన్న అపార గౌరవం కారణంగా, ఆయన మాటను కాదు అనలేక, ఈ సిఇనిమలో శివుడి పాత్ర చేయడానికి అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఈ పాత్ర కోసం ఆయన రెమ్యూనరేషన్ తీసుకున్నాడా లేదా అనేది తెలియదు కానీ, తన బిజీ షెడ్యూల్ లో వారం రోజుల డేట్స్ మాత్రం ఈ చిత్రానికి కేటాయించి తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేశాడు. అక్షయ్ కుమార్ ని ఒప్పించిన ఆ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ నటిస్తున్నాడు అని వార్తలు వచ్చిన కొత్తల్లో కచ్చితంగా ఆయన శివుడి క్యారక్టర్ చేస్తున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
మేము కూడా శివుడి క్యారక్టర్ కోసమే ప్రభాస్ ని అడిగాము, కానీ ఆయన రుద్ర క్యారక్టర్ ని ఎంచుకున్నాడు అంటూ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఈ క్యారక్టర్ నిడివి దాదాపుగా 25 నిమిషాల వరకు ఉంటుందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానుల్లో మొదట్లో ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు కానీ, రీసెంట్ గా విడుదల చేసిన శివయ్య సాంగ్ మాత్రం అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. మంచు విష్ణు ఈ సినిమాని ఎంత సీరియస్ గా తీసుకొని చేసాడో ఈ సాంగ్ ని చూసి చెప్పేయొచ్చు. మేకింగ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. మంచు కంపెనీ నుండి ఈ స్థాయి క్వాలిటీ ని కూడా ఆడియన్స్ ఆశించలేదు. ఇలా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా అనిపిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.