Prabhas : పాన్ ఇండియన్ స్టార్ కి పర్యాయపదం లాంటి హీరో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas). ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత పెద్ద నటుడైన ప్రభాస్ సినిమాలో కాసేపు కనిపించినా చాలు అనుకునే రోజులివి. ఎందుకంటే ప్రభాస్ సినిమాని ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆయన సినిమాలో కాసేపు కనిపించినా గొప్ప రీచ్ ఉంటుంది , అందుకే స్టేటస్ లు కూడా మరిచిపోయి ఆయన సినిమాల్లో నటించడానికి తపిస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ మాత్రం తనతో పనిచేసే హీరోయిన్స్ విషయం ఒక స్ట్రిక్ట్ రూల్ ని అనుసరిస్తూ ఉంటాడట. ఏ హీరోయిన్ అయినా తన సినిమాలో నటిస్తే మళ్ళీ అదే హీరోయిన్ తో చేయడానికి అసలు ఇష్టపడడు అట. కేవలం కాజల్ అగర్వాల్, అనుష్క విషయం లోనే ఇలా జరిగింది. అనుష్క తో అయితే దాదాపుగా ఆయన మూడు సినిమాలు చేసాడు, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కూడా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడంటే, గతంలో ఆయన త్రిష(trisha krishnan) తో కలిసి ప్రభాస్ మూడు సినిమాలు అప్పట్లో చేసాడు. బుజ్జిగాడు చిత్రం వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం. బయట కూడా వీళ్ళు చాలా మంచి స్నేహితులు కావడంతో కోలీవుడ్ మీడియా వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది అంటూ గాసిప్స్ ని క్రియేట్ చేసింది. ఇది ప్రభాస్ ని అప్పట్లో బాగా ఇబ్బంది పెట్టిందట. అందుకే అప్పటి నుండి హీరోయిన్స్ ని రిపీట్ చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) తో ‘డార్లింగ్’ అనే చిత్రం చేసాడు, ఆ వెంటనే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే చిత్రం కూడా చేశాడు. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి దిల్ రాజు స్టోరీ రాసుకున్నప్పుడే కాజల్ కి అడ్వాన్స్ ఇచ్చేశాడట. దీంతో తప్పక నటించాల్సి వచ్చింది. వీళ్లిద్దరి పై కూడా ఎన్ని రూమర్స్ వచ్చాయో మన అందరికీ తెలిసిందే.
ఇక అనుష్క(Anushka Shetty) తో అయితే ప్రభాస్ కి మంచి బాండింగ్ ఉంది. ఆమెతో ఎన్ని సినిమాలు చేయడానికి అయినా ఇష్టపడతాడు. ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ లు వచ్చాయి.వీళ్ళు అయితే ఇప్పటికీ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తుంటాయి కానీ, ప్రభాస్ పెద్దగా ఈ విషయం లో పట్టించుకోడట. కానీ హీరోయిన్స్ ని రిపీట్ చేయకూడదు అనే రూల్ మాత్రం చాలా కఠినంగా అనుసరిస్తున్నాడట, ఒక్క అనుష్క కి మాత్రమే మినహాయింపు అని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో వినిపించే టాక్. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘రాజా సాబ్’ చిత్రం తో పాటు హను రాఘవపూడి తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. రాజా సాబ్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది, ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : కార్తీక దీపం’ వంటలక్క రెమ్యూనరేషన్ తో ఒక సినిమానే తీసేయొచ్చు తెలుసా!