Prabhas Resolves Sandeep Deepika Fight : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరు ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అర్జున్ రెడ్డి(Arjun Reddy),కబీర్ సింగ్ (Kabeer Sing), అనిమల్ (Animal) సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్(Spirit) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని చర్చలైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా దీపిక పదుకొనే (Deepika Padukone) కి సందీప్ ఈ కథని వినించాడు. ఆమెకి కూడా ఈ కథ బాగా నచ్చినప్పటికి ఆమె కొన్ని కండిషన్స్ అయితే పెట్టింది.
Also Read : త్రిప్తి డిమ్రి విషయం లో అసంతృప్తితో ఉన్న ప్రభాస్…మరి సందీప్ ఆమెను మారుస్తాడా..?
సందీప్ రెడ్డివంగ కి ఆ కండిషన్స్ నచ్చలేదు. దాంతో ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి (Tripthi Dimri) ని హీరోయిన్ గా ప్రకటించాడు. ఇక అప్పటినుంచి సందీప్ రెడ్డివంగా దీపిక పదుకొనే మధ్య ఒక వార్ అయితే నడుస్తోంది…ఇక ఈ మ్యాటర్ లోకి ప్రభాస్ ఎంటర్ అయి అటు దీపిక, ఇటు సందీప్ తో మాట్లాడి ఆ ఇష్యూ ను క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది.
గత వారం రోజుల నుంచి వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ట్వీట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. సందీప్ రెడ్డివంగా చేసిన ట్వీట్ దానికి దీపిక పదుకొనే ఇచ్చిన రిప్లై ఇవ్వన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియా వారం రోజుల నుంచి చాలా హాట్ హాట్ గా ఉంటుంది. ఇక బాలీవుడ్ మాఫియా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ వివాదం ఎక్కడ దాకా వెళుతుందో అని అందరూ అనుకున్నప్పటికి ప్రభాస్ వాళ్ళిద్దర్నీ కాంప్రమైజ్ చేయడంతో ఇప్పుడు రెండు వైపులా నుంచి ఇద్దరు ఎవరికి వాళ్లు సైలెంట్ అయిపోయినట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాలో చేస్తున్నందుకు త్రిప్తి డిమ్రి కి నాలుగు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ గా ఇస్తున్నారట. దీపిక పదుకొనే 20 కోట్ల రెమ్యూనరేషన్ అడగడంతో పాటు లాభాల్లో వాటాను కూడా అడిగింది. అది నచ్చకనే కేవలం 4 కోట్లు పెట్టి త్రిప్తిని ఈ సినిమాలోకి తీసుకొచ్చాడు.