https://oktelugu.com/

Prabhas New Look: కిక్ ఇస్తున్న ప్రభాస్ నయా లుక్… సోషల్ మీడియా షేక్, ఆ చిత్రం కోసమేనా?

సలార్ 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు కథ అంతా పార్ట్ 2 లో దాచేశాడు ప్రశాంత్ నీల్. కాగా ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : April 24, 2024 / 11:47 AM IST

    Prabhas New Look

    Follow us on

    Prabhas New Look: ఇండియాస్ అతిపెద్ద స్టార్ గా ఉన్నారు ప్రభాస్. ఆయనతో సినిమా అంటే కనీసం ఐదు వందల కోట్లు కావాలి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా వందల కోట్ల వసూళ్లు రాబడుతుంది. గత ఏడాది సలార్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రభాస్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేశాడు ప్రశాంత్ నీల్. సలార్ వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    సలార్ 2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు కథ అంతా పార్ట్ 2 లో దాచేశాడు ప్రశాంత్ నీల్. కాగా ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. కల్కి 2829 AD సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక రోల్స్ చేస్తున్నారు.

    దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనె ప్రభాస్ తో జతకడుతుంది. అలాగే మరో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని భాగమైంది. సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ టైటిల్ తో మరొక చిత్రం చేస్తున్నాడు. ఇది హారర్ కామెడీ చిత్రం అంటున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

    కాగా ప్రభాస్ లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. వైట్ షర్ట్ ధరించిన ప్రభాస్ పొడవైన జుట్టుతో ఉన్నారు. గతంలో ప్రభాస్ ని అలా చూసింది లేదు. ప్రభాస్ నయా లుక్ చూసిన నెటిజెన్స్ పలు విధాలుగా అంచనా వేస్తున్నారు. బహుశా సందీప్ రెడ్డి వంగా చిత్రం కోసం ప్రభాస్ ఇలా తయారయ్యాడేమో అంటున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ టైటిల్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో స్పిరిట్ పట్టాలెక్కే సూచనలు కలవు.