Prabhas New Film List: తెలుగు సినిమా ఇండస్ట్రిలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఆయనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక రీసెంట్ గా రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడం ఆయన కొంతవరకు డీలా పడ్డాడు… దాంతో ఇకమీదట రాబోతున్న సినిమాల విషయంలో ఆయన కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లుగా నిలపాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. ఇకమీదట చేయబోయే సినిమాలను సైతం మోహమాటానికి వెళ్లి చేయకూడదనే ఆలోచనలో ఉన్నాడట. కాబట్టి ఆయన మంచి కథల కోసం వేచి చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన కమిట్ అయిన సినిమాలు పూర్తి అవ్వడానికి రెండు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశం ఉంది.
కాబట్టి ఇప్పుడు మరి కొంతమంది తమిళ్ డైరెక్టర్లు చెప్పే కథలను కూడా వింటున్నాడు. కారణం ఏంటి అంటే తమిళ్ డైరెక్టర్లు కొత్త కథలతో అతని దగ్గరకు వస్తున్నారట. అల్లు అర్జున్ సైతం తమిళ్ డైరెక్టర్స్ కే ఓటు వేస్తున్నాడు. కాబట్టి ప్రభాస్ సైతం వాళ్ళను తమ వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
జైలర్ సినిమాతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నెల్సన్ సైతం ప్రభాస్ కి ఒక కథను వినిపించాలని చూస్తున్నాడట. వీలైనంత తొందరగా ప్రభాస్ కూడా ఆ కథను వినడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా ఆయన ఈ సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత కథను వింటాడట… ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఈ సినిమా ఆయనకంటూ ఒక బెంచ్ మార్క్ గా ఈ సినిమా నిలుస్తుందా?
లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక తమిళ్ డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో మంచి మేకింగ్ తో ప్రేక్షకులను అలరించే విధంగా సినిమాలను చేస్తున్నారు. కాబట్టి వాళ్లతో సినిమా చేస్తే తనకి కూడా సక్సెస్ దక్కుతుందని ప్రభాస్ సైతం వాళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది…