తెలుగు చలనచిత్ర రంగంలో బాహుబలి ఓ మైలురాయి. తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించిన ఘనత దర్శకుడు రాజమౌళికే దక్కుతుంది. అలాంటి చిత్ర నిర్మాణం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరిగింది. ఈ సినిమాకి రామోజీరావు కూడా పెట్టుబడి పెట్టారనే ప్రచారం సైతం జరిగింది. బాహుబలిలో ప్రతి సన్నివేశం ఓ అద్బుతమే. ప్రతి మాట ఓ సూపర్ హిట్టే. అంతటి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినవి మహీష్మతి రాజ్యం రూపకల్పనే అని తెలుసు. అంతలా ప్రేక్షకులకు హత్తుకుపోయేలా చూపిన నైపుణ్యం రాజమౌళికే చెందుతుంది. అంతటి ఖ్యాతి గడించిన బాహుబలిలో వేసిన సెట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రామోజీ ఫిల్మ్ సిటీ రూపుదిద్దుకుంది. అద్భుతమైన అలంకరణతో కనువిందు చేస్తోంది. బాహుబలి చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన రామోజీ ఫిల్మ్ సిటీ చరిత్ర మనకు తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి సినిమాల షూటింగ్ కోసం వస్తుంటారు. దాని ఘనత ఇనుమడింపజేసేందుకు రామోజీరావు అనేక రూపాల్లో ప్రయత్నాలు చేశారు. చివరికి దాని విశిష్టత దేశవ్యాప్తంగా ప్రచారం జరిగి అంతా వైభవంగా తయారైంది.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. నాగ అశ్విన్ దర్శకుడు. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుపుకుంటోంది.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కొన్ని విదేశాల్లో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అంటే దాదాపుగా 90 శాతం షూటింగ్ ఆర్ఎఫ్ సీలోనే జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీకి మరో బాహుబలి దక్కినట్లే. ఈ సినిమా సెట్లన్ని ఫిల్మ్ సిటీలోనే వేయబోతున్నారు. దాదాపు 50 శాతం సన్నివేశాలు సెట్లోనూ మిగిలినదంతా బ్లూ మేట్ లోనూ తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఆమె సెట్టోకి అడుగు పెట్టబోతోందని సమాచారం.